Lifestyle: అత‌నంటే ఇష్టం లేదు.. కేవ‌లం మెసేజెస్ చేయాల‌నిపిస్తోంది

i want to be in a textationship with my partner

Lifestyle: ఓ మర్చెంట్ నేవీ ఆఫీస‌ర్‌తో ఆన్‌లైన్‌లో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అయితే నేను అత‌నితో కేవ‌లం చాట్స్ మాత్ర‌మే చేస్తుంటాను. అత‌ను సెల‌వుల‌పై ఇంటికి వెళ్లాడ‌ట‌. ఇప్పుడేమో న‌న్ను క‌లుస్తా అంటున్నాడు. నాకు క‌ల‌వాల‌ని లేదు. కేవ‌లం అత‌నితో చాట్స్ చేయ‌డం అంటేనే ఇష్టం. ఈ విష‌యం అత‌నికి ఎలా తెలియ‌జేయాలి?

నిపుణుల స‌ల‌హా: అస‌లు ఇలాంటి ఆలోచ‌న‌లు ఎలా వ‌స్తాయండీ. త‌ప్పుగా అనుకోవ‌ద్దు. మీరు ఆ ఆఫీస‌ర్‌తో ఎందుకు మాట్లాడాల‌నుకుంటున్నారు? అయినా కేవ‌లం మాట‌ల‌తోనే ప్రేమించేద్దాం అనుకున్నారా? ఇప్పుడు అత‌ను మీ విష‌యంలో సీరియ‌స్‌గా ఉండి మిమ్మ‌ల్ని క‌ల‌వాల‌ని చూడాల‌ని అంటున్నాడంటే క‌చ్చితంగా అత‌ను మిమ్మ‌ల్ని ఇష్ట‌ప‌డుతున్నాడ‌నే చెప్పాలి. మీకు అత‌నితో ప్రేమ పెళ్లి లాంటివి చేసుకునే ఉద్దేశం లేన‌ప్పుడు ఎందుకు చాట్ చేసారు? పైగా ఈ టెక్స్‌టేష‌న్‌షిప్ ఏంటి? ఇది చాలా త‌ప్పు. అత‌నికి ఇప్ప‌టికైనా మీరు కేవ‌లం మెసేజ్ చేయాల‌నుకున్నారు అని మాత్ర‌మే చెప్పండి. రేపు మ్యాట‌ర్ సీరియ‌స్ అయ్యి అది వేరేలా పోక‌ముందే దీనికి ఓ ఫుల్ స్టాప్ పెట్టండి. ద‌య‌చేసి ఇలాంటి కొత్త ట్రెండ్స్‌కి దూరంగా ఉంటే మంచిది.