Lifestyle: మాజీలతో శృంగారం గురించి అడగచ్చా?
Lifestyle: ప్రేమలో ఉండే చాలా మంది జంటలకు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలన్న ఆతృత కచ్చితంగా ఉంటుంది. ఈరోజుల్లో ప్రేమ అంటే నమ్మలేని అంశంగా మారిపోయింది. ప్రేమ ఒకరితో పెళ్లి ఒకరితోలా పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రేమ జంటలు పెద్దల కారణంగా విడిపోతున్నాయి. మరికొందరు మోసం చేసి వేరే వారిని పెళ్లి చేసేసుకుంటున్నారు.
మోసపోతున్న మగ, ఆడవారు రిలేషన్‌షిప్స్‌కి మరో అవకాశం ఇచ్చి చూస్తున్నారు. అంటే ఒక అమ్మాయో, అబ్బాయో మోసం చేసినా.. గతిలేక వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా వారిని మర్చిపోయేందుకు మరో రిలేషన్షిప్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఇందులో తప్పేం లేదు. కానీ ఆ రిలేషన్షిప్లో నిజాయతీ ఉండాలి. అయితే.. ఈ మధ్యకాలంలో యువతీ యువకులకు తమ భాగస్వామ్యులపై ఎన్నో సందేహాలు ఉంటున్నాయి. ఆ సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఎలాంటి అడగాలి? ఎలాంటివి అడగకూడదు? అనేవి కొన్ని ఉంటాయి.
ఉదాహరణకు.. మాజీలతో ఎలా విడిపోయారు? ఏం జరిగింది? అనే విషయాలను షేర్ చేసుకోవచ్చు. కానీ మాజీలతో శారీరకంగా కలిసారా? సెక్స్ చేసారా? వంటి విషయాలను అడగలేం. అడిగినా చాలా మంది లేదనే చెప్తారు. ఎవరో కొందరు మాత్రమే నిజాయతీగా నిజాలు ఒప్పుకుంటారు. అయితే ఈ విషయాలను అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు కానీ.. ముందు ఆ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చూసి అప్పుడు అడగాలని అంటున్నారు ప్రముఖ రిలేషన్షిప్ కౌన్సిలర్ రుచీ రూహ్.
అంటే.. ఇప్పుడు ఒక అబ్బాయి, అమ్మాయి నిజాయతీగా రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి.. వారిద్దరూ ఈ మాజీలతో శృంగారం గురించి చక్కగా చర్చించుకోవచ్చు. అలా కాకుండా నిన్న ప్రపోజ్ చేసి ఈరోజు ఈ విషయాల గురించి అడిగితే మాత్రం అది మరో బ్రేకప్‌కు కానీ మనస్పర్థలకు కానీ దారి తీస్తుంది. ఇలాంటి విషయాలు ఎప్పుడు అడగాలంటే.. ఒక అమ్మాయి, అబ్బాయి కేవలం ప్రేమించుకోవడం వరకే కాకుండా పెళ్లి వరకూ ప్రయాణించాలనుకుంటే అప్పుడు తప్పకుండా అడగచ్చు. ఏదో టైం పాస్ కోసం అయితే మాత్రం ఇలాంటివి చర్చించుకోవాల్సిన అవసరం లేదని రుచీ అంటున్నారు.
ఒకవేళ అడిగినా ఎదుటి వ్యక్తి చెప్పలేకపోతే వారిని అడిగి ఇబ్బంది పెట్టి అవమానించాల్సిన పని లేదని రుచీ అభిప్రాయపడుతున్నారు. నిజంగా ప్రేమించినవారైతే అన్నీ నిజాయతీగానే ఒప్పుకుంటారు. వారు చెప్పనంత మాత్రాన నిజాయతీ లేదని కాదు.. అవనసరంగా పాత విషయాలను చెప్పి ఇప్పుడున్న రిలేషన్‌షిప్‌ను నాశనం చేసుకోవాలని అనుకోని వారు కూడా ఉంటారు. కాబట్ట మీ పరిధులను బట్టి ఇలాంటి విషయాలను పార్ట్నర్తో ఆచి తూచి చర్చించుకోవాలని రుచి తెలిపారు.