Lifestyle: నా భ‌ర్త‌కు నా స్నేహితురాలితో పెళ్లి చేయాల‌నుకుంటున్నాను

I am ill and i want my husband to marry my best friend

Lifestyle: మేడం.. నాకు పెళ్లై 8 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు నా వ‌య‌సు 40. పిల్ల‌లు లేరు. ఈ విష‌యంలో నేను నా భ‌ర్త ఎంత కుంగిపోతున్నామో మాకే తెలుసు. ఇక నాకు పిల్ల‌లు పుట్ట‌ర‌ని అర్థ‌మైపోయింది. అందుకే ఓ నిర్ణ‌యం తీసుకున్నాను. నా భ‌ర్త‌కు నా స్నేహితురాలితో వివాహం జ‌రిపించాల‌ని అనుకుంటున్నాను. నా నిర్ణ‌యం స‌రైన‌దే అంటారా?

నిపుణుల స‌ల‌హా

పిల్ల‌లు పుట్ట‌ర‌ని మీకు ఎవ‌రు చెప్పారు? వైద్యుల‌ను సంప్ర‌దించారా? ఎందుకు పిల్ల‌లు క‌ల‌గ‌డంలేదో ఎప్పుడైనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారా? ఇవేవీ మీరు మెయిల్‌లో రాయ‌లేదు. ఇక‌పోతే.. కంటేనే పిల్ల‌లా? త‌ల్లీదండ్రుల కోసం పాకులాడుతున్న ఎంద‌రో పిల్ల‌లు అనాథాశ్ర‌మాల్లో మ‌గ్గిపోతున్నారు. ఎవ‌రో ఒక‌రిని తెచ్చి పెంచుకుంటే మీకు పిల్ల‌లు లేర‌న్న లోటూ తీరుతుంది.. అనాథ‌గా మారిన‌ ఆ బిడ్డ‌కు ఓ మంచి అమ్మానాన్న‌లు దొరికిన‌ట్లూ అవుతుంది. ఇలా మీరు ఎందుకు ఆలోచించ‌లేక‌పోతున్నారు.

ఇక రెండో పెళ్లి విష‌యానికి వ‌ద్దాం. మీరు మీ స్నేహితురాలిని మీ భ‌ర్త‌కు ఇచ్చి రెండో పెళ్లి చేయాల‌నుకుంటున్నారు. దీని గురించి మీ భ‌ర్త‌కు చెప్పారా? ఆయ‌న ఉద్దేశం ఏంటో క‌నుక్కున్నారా? పిల్ల‌లు లేర‌న్న బాధ‌తో మీకు మీరే అన్ని నిర్ణ‌యాలు ఆలోచించ‌కుండా తీసేసుకుంటున్నారు అనిపిస్తోంది. ఒక‌సారి మీ భ‌ర్త‌తో బిడ్డ‌ను ద‌త్త‌త తీసుకోవ‌డం గురించి కానీ.. లేదా ఐవీఎఫ్ ప‌ద్ధ‌తి ద్వారా పిల్ల‌ల్ని క‌న‌డం గురించి కానీ క్లుప్తంగా మాట్లాడి చూడండి. ఆ త‌ర్వాత బాగా ఆలోచించి ఓ మంచి నిర్ణ‌యం తీసుకోండి.