Expert Advice: కాబోయే వాడు మాజీ ప్రేయ‌సితో బ్యాచిల‌ర్స్ పార్టీ చేసుకున్నాడు.. ఏం చేయాలి?

Expert Advice: నాకు పెళ్లి కుదిరింది. నాకు కాబోయే వాడు త‌న మాజీ ప్రేయసితో క‌లిసి వారం రోజుల పాటు బ్యాచిల‌ర్స్ పార్టీ చేసుకున్న‌ట్లు నా స్నేహితుల ద్వారా తెలిసింది. ఇదే విష‌యం గురించి అత‌న్ని ప్ర‌శ్నిస్తే.. త‌మ మ‌ధ్య ఏమీ లేద‌ని కేవ‌లం ఫ్రెండ్స్ మాత్ర‌మే అని అంటున్నాడు. నాకు అత‌న్ని పెళ్లి చేసుకోవాలంటే భ‌య‌మేస్తోంది. ఏం చేయ‌మంటారు?

నిపుణుల స‌ల‌హా: మీకు వ‌చ్చిన క‌ష్టం ఎవ్వ‌రికీ రాకూడ‌దు. కానీ పెళ్లికి ముందే ఈ విష‌యం తెలిసింది కాబ‌ట్టి మించిపోయింది ఏమీ లేదు. ఒక‌సారి అత‌న్ని అత‌ని మాజీ ప్రేయ‌సిని పెద్ద‌ల ముందు నిల‌బెట్టి మాట్లాడండి. రేపు పెళ్ల‌య్యాక కూడా ఇలాగే క‌లుస్తూ ఉంటామంటే కుద‌ర‌దు అని హెచ్చ‌రించేలా చేయండి. మీది పెద్ద‌లు నిర్ణ‌యించిన వివాహ‌మే కాబ‌ట్టి.. ఇలాంటి వ్య‌క్తితో తాను జీవితాంతం క‌లిసి బ‌త‌క‌లేను అనే విష‌యాన్ని స్ప‌ష్టం చేయండి. ఒక‌వేళ అత‌న్ని మీకు ఇష్ట‌ప‌డుతున్న‌ట్లైతే.. అత‌ను మార‌క‌పోతే కౌన్సిలింగ్‌కి తీసుకెళ్లండి. పెద్ద‌లు చెప్పినా కౌన్సిలింగ్ ఇప్పించినా అత‌ను మాట విన‌క‌పోతే మీకు ఎలాంటి భ‌యాందోళ‌న‌లు పెట్టుకోకుండా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవ‌చ్చు.

ALSO READ:

Relationship: “అందుకే నా భార్య‌ను మోసం చేసాను”

ప్రియుడిని వ‌దిలి ఉండ‌లేక‌పోతున్నారా? ఇది చాలా డేంజ‌ర్