Lifestyle: సెక్స్‌కి ముందు ఈ అంశాలను పరిగణిస్తున్నారా?
Lifestyle: కొందరికి శృంగారం అనేది ఎంతో ముఖ్యమైన అంశం. కొంతమందికి సెక్స్ అనేది వారి గుర్తింపులోని ప్రధాన అంశంగా భావిస్తుంటారు. మరికొందరు అసలు ఈ అంశాన్నే పట్టించుకోరు. అయితే సెక్స్ విషయంలో అందరూ గుర్తుంచుకోవాల్సిన.. పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటి?
అనుమతి
సెక్స్ విషయంలో మీ పార్ట్నర్ నుంచి అనుమతి తీసుకోవడం ఎంతో ముఖ్యం. అది మగవారైనా ఆడవారైనా సరే. ఒకరి అనుమతి లేకుండా చేసే పని కాదు ఇది.
రక్షణ
పిల్లలు వద్దు అనుకునేవారు.. పెళ్లికి ముందే కలవాలని అనుకునేవారు తప్పనిసరిగా రక్షణ తీసుకోవాల్సిందే. సేఫ్ సెక్స్ వల్ల STI (లైంగిక ఇన్ఫెక్షన్లు) నుంచి విముక్తి పొందవచ్చు. ఇందుకోసం కండోమ్‌లు, డెంటల్ డ్యామ్స్ ఉపయోగపడతాయి.
సంభాషణ
శృంగార చర్యలో పాల్గొనాలంటే ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన సంభాషణ ఉండాల్సిందే. మీకు నచ్చేవి నచ్చనివి, మీకున్న ఇబ్బందులు మీ పార్ట్నర్తో మనసు విప్పి చెప్పండి. దీని వల్ల ఇద్దరి మధ్య సౌకర్యం, సఖ్యత ఏర్పడతాయి.
శుభ్రత
మీ ప్రైవేట్ భాగాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది కేవలం శృంగార చర్య సమయంలోనే కాదు ఎల్లప్పుడూ ఆ భాగాలు శుభ్రంగానే ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు. చర్య ముగిసాక మూత్రం పోసి వెంటనే గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.