నాన్న చనిపోయినట్లు నమ్మించాడు.. ఏం చేయాలి?
Lifestyle: “” నాకు నాలుగేళ్లు ఉన్నప్పుడు మా నాన్నను కలిసాను. ఆ తర్వాత ఆయన డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయారు అని మా అమ్మ చెప్పింది. ఇప్పుడు నాకు 26 ఏళ్లు. ఓసారి నేను ఫేస్‌బుక్ చూస్తున్న సమయంలో మా నాన్న ఖాతా యాక్టివ్‌లో ఉండటం చూసి షాకయ్యాను. అందులో నా కజిన్ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు పోస్ట్ చేసి ఉన్నాయి. నాన్న బతికే ఉండి చనిపోయినట్లు మమ్మల్ని నమ్మించాడని తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? నాన్నతో మాట్లాడాలా వద్దా? “”
నిపుణుల సలహా: మీ నాన్న చనిపోయినట్లు మీ అమ్మ చెప్పింది అంటున్నారు. ఆమెకు ఎవరు చెప్పారు? వైద్యులు చెప్పారా? లేక ఆవిడే అలా ఊహించేసుకున్నారా? ముందు ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకోండి. మీ కజిన్ పిల్లలతో ఫోటోలు దిగుతున్నారు అంటున్నారు. మీ కజిన్‌ని అడిగి చూడండి. మీ నాన్న గురించి వారు మీకు ఎందుకు చెప్పలేదు? దాని వెనుక ఏదన్నా కారణం ఉందా అనేది తెలుసుకోండి. మీకు నాన్నతో కలిసి ఉండాలని ఇప్పటికీ ఉంటే ఆయన్ను కలిసి మనసారా మాట్లాడండి. మీకు ఆయన అవసరం.. ఈ వయసులో ఆయనకు మీ అవసరం ఎంత ఉందో తెలియజేయండి. కుదిరితే కౌన్సిలింగ్ ఇప్పించండి. అన్నీ సర్దుకుంటాయి.