Relationship: “అందుకే నా భార్యను మోసం చేసాను”
Relationship: 27 ఏళ్లకే వయసు అయిపోతోందని ఓ యువకుడికి తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేసారు. కానీ అతను ఆమెతో కలిసి ఉండలేక మోసం చేయాల్సి వచ్చిందట. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన మాటల్లోనే..
“” నేను బిహార్‌కి చెందిన ఓ ఫోటోగ్రాఫర్‌ను. మా ఇంట్లో నా పెళ్లి విషయంలో అమ్మానాన్నలు తొందరపడ్డారు. నాకు 27 ఏళ్లు రాగానే పెద్దవాడైపోతున్నానని నా ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసేసారు. అది నాకు ఇష్టం లేని పెళ్లి. అయినా ఆ అమ్మాయి చాలా చక్కగా ఉండేది. నన్ను బాగా చూసుకునేది. దాంతో ఇష్టం లేని పెళ్లి కాస్తా ఆమెపై ప్రేమ కలిగేలా చేసింది. ఏడాది వరకు బాగానే ఉన్నాం. కానీ నా ఉద్యోగ రిత్యా మేం బెంగళూరులో స్థిరపడాల్సి వచ్చింది. జీవితం సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో నాకో బిడ్డ కావాలి అంది.
నేను షాకయ్యాను. ఎందుకంటే బిడ్డను కనగానే సరిపోదు కదా. పెంచి పోషించాల్సిన స్థోమత కూడా ఉండాలి. నా దగ్గర అందుకు కావాల్సిన డబ్బు లేదు. 29 ఏళ్లకే పిల్లలు ఎందుకు అని తనకు చెప్పాను. కానీ తను వినకపోగా నాలోనే ఏదో లోపం ఉందని నిందలు వేసింది. దాంతో మా మధ్య దూరం పెరిగింది. నేను ఇంటికి వెళ్లడం మానేసాను.
ఓసారి పని మీద స్టాండప్ కామెడీ షోకి వెళ్లాను. అక్కడ షో చేస్తున్న వ్యక్తి ఓ డేటింగ్ యాప్ పేరు చెప్పాడు. అది విని అక్కడున్నవారంతా నవ్వుకున్నారు. కానీ నాకు ఎందుకో అది కాస్త కొత్తగా అనిపించి డౌన్‌లోడ్ చేసుకున్నాను. అందులో నాలాగే బాధపడుతున్న ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. ఇద్దరం కలుసుకుని ఒకరి బాధలు ఒకరు పంచుకున్నాక మా మనసులు తేలికపడ్డాయి. ఇప్పుడు నాకు తనతో ఉంటే నా జీవితం బాగుంటుంది అనిపిస్తోంది. ఇంట్లో వారితో మాట్లాడి విడాకులకు అప్లై చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.
నేను చేస్తోంది తప్పో కాదో నాకు తెలీదు కానీ.. జీవితంలో ఏ సమస్య వచ్చినా అర్థం చేసుకోలేని భాగస్వామి ఉంటే నాలాగే బాధపడతారు. కాబట్టి మీకు నచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోండి. అంతేకానీ ఎవరో చెప్పారనో ఎవరో బలవంత పెట్టారనో చేసుకుంటే నాలా బాధపడతారు “”
ALSO READ: