UTI: ప్యాంట్ల వల్లే యోని భాగంలో దురద ఇన్‌ఫెక్షన్లు..!
UTI: మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు.. ఈ మధ్యకాలంలో ఆడవారిని అత్యధికంగా ఇబ్బందిపెడుతున్న సమస్య ఇది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి కానీ.. టైట్‌గా ఉండే ప్యాంట్లు వేసుకోవడం ప్రధాన కారణాల్లో ఒకటని వైద్య నిపుణులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా లెదర్ ప్యాంట్లు. ఈ లెదర్ ప్యాంట్లు వేసుకోవడానికి సౌకర్యంగానే ఉంటాయి కానీ వీటి వల్ల యోని భాగంలో, తొడల మధ్య చెమట పడుతుంటుంది. దీని వల్ల ఆ ప్రదేశాల్లో బ్యాక్టీరియా పేరుకుంటుంది. ఫలితంగా ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తుంది.
ఈ లెదర్ ప్యాంట్లు, టైట్ ప్యాంట్లు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే.. మూత్రం ఎక్కువగా రాకపోయినా కడుపు భాగంలో టైట్‌గా ఉండటం వల్ల మూత్రం కాస్త కారిపోయేలా చేస్తుంది. దీని వల్ల ప్యాంటీలపై మూత్రం చుక్కలు కారి దాని వల్ల కూడా ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. టైట్ ప్యాంట్లు వేసుకోవడం వల్ల గ్యాస్టో ఈసోఫాగల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) వస్తుంది. దీని వల్ల గుండెలో మంట, కడుపులో నుంచి రకరకాల సౌండ్స్ వస్తుంటాయి. టైట్‌గా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల యోనిలో దురద, వైట్ డిశ్చార్జి అవుతుంటాయి. ఇవి కొన్ని మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ లక్షణాలుగా ఉంటాయి కానీ ప్రతిసారీ అదే అవ్వాల్సిన పని లేదు. పెళ్లైన ఆడవారు ప్రతి మూడేళ్లకోసారి Pap టెస్ట్ చేయించుకోవాలి. Pap అంటే పాప్ స్మియర్ టెస్ట్.