Alcohol మానలేక‌పోతున్నారా.. ఈ టిప్స్ మీకోస‌మే

మ‌ద్యం సేవించ‌డం అనేది ఓ వ్య‌స‌నం (alcohol). ఒక్క‌సారి అల‌వాటైతే ఇక రోజూ నాలుక‌కు ఆ రుచి అంద‌క‌పోతే ఉండ‌లేరు. కాఫీ టీ లాగే దీనిని రోజూ తాగేవారు కూడా ఉంటారు. అయితే ఎప్పుడో ఓసారి అయితే ప‌ర్వాలేదు కానీ రోజూ తాగితే మాత్రం ఎంత ప్ర‌మాదమో మ‌న‌కు తెలియంది కాదు. ఒక‌వేళ మానేయాల‌నుకున్నా మీ వ‌ల్ల కాక‌పోతే ఈ టిప్స్ ట్రై చేసి చూడండి.

డ్రింకింగ్ మానేయాల‌నుకుంటే అస‌లు ఎందుకు తాగుతున్నారు? ఏ స‌మ‌యంలో తాగుతున్నారో ముందు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. మీరు పార్టీల‌లో, అప్పుడ‌ప్పుడూ ఒక పెగ్ తాగుతుంటే ప‌ర్వాలేదు. కానీ ఒత్తిడి, ఇంట్లో స‌మ‌స్య‌లు, వ‌ర్క్ స‌మ‌స్య‌ల వ‌ల్ల తాగుతున్నారంటే ఇది సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అంశం. ఒక‌వేళ మీరు పార్టీల‌కు వెళ్లిన‌ప్పుడు, లేదా ఫ్రెండ్స్‌తో ఉన్న‌ప్పుడు మీకు తాగే మూడ్ లేక‌పోయినా వారు ఫోర్స్ చేస్తుంటారు. అలాంటివారికి ముందే చెప్పేయండి నేను తాగుడు మానేద్దామ‌ని అనుకుంటున్నాను అని. వారు విన‌క‌పోతే కాస్త సీరియ‌స్‌గానే ఉండండి. అంతేకానీ వారు ఫోర్స్ చేస్తున్నార‌నో లేదా వారు ఫీల‌వుతున్నారో మీరు మ‌ళ్లీ తాగితే మాత్రం అది మీకే ఎఫెక్ట్ ప‌డుతుంది. రేపు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తే ఫోర్స్ చేసినవారే వ‌ద్దు వ‌ద్దు అంటే విన్నావా ఇప్పుడు చూడు ఏమైందో అని నీతులు చెప్తుంటారు. (alocohol)

మీ క‌ళ్ల ముందు ఎలాంటి తాగుడుకి సంబంధించిన అంశాలు ఉండ‌కుండా చూసుకోండి. ఎందుకంటే.. మీరు ఎంత వ‌ద్దు అనుకున్నా.. అస‌లు తాగాల‌న్న ఆలోచ‌న లేక‌పోయినా ఆల్క‌హాల్‌కి సంబంధించిన‌వి చూడ‌గానే మ‌న‌సు వాటిపైకి వెళ్లిపోతుంది. ఒక‌వేళ అంత‌గా తాగాల‌ని ఉంటే.. ఆల్క‌హాల్ లేకుండా చాలా బేవ‌రేజెస్ ఉంటాయి. అంటే కాక్‌టెయిల్స్, మాక్ టెయిల్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివి తాగండి. రోజూ ఒకే స‌మయానికి తాగుతున్నారనుకోండి.. ఆ స‌మ‌యంలో మీరు ఏదో ఒక ప‌ని క‌ల్పించుకుని బిజీగా ఉండండి. ఒత్తిడి, యాంక్జైటీ వ‌ల్ల తాగి సాంత్వ‌న పొందుతుంటే మాత్రం తాగుడుకి బ‌దులు మెడిటేష‌న్ చేయ‌డ‌మో లేదా మీకు న‌చ్చిన జోన‌ర్‌లో ఏద‌న్నా సినిమా చూడ‌ట‌మో చేయండి. ఆ సాంత్వ‌న వీటి నుంచి కూడా పొంద‌వ‌చ్చు. (alcohol)