Breakfast: ఉదయాన్నే తినకూడని వరస్ట్ ఫుడ్స్ ఇవే..!
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ (breakfast) చేయడం ఎంత ముఖ్యమో.. ఏం తింటున్నామో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. కొందరు స్ట్రిక్ట్‌గా అన్ని పోషకాలు అందేలా ఉండే బ్రేక్‌ఫాస్ట్ తింటారు. మరికొందరు కడుపుకి ఏదో ఒకటి తినాలి కాబట్టి తింటూ ఉంటారు. అసలు ఉదయాన్నే ఎలాంటి ఆహారాలను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోకూడదో తెలుసుకుందాం. (breakfast)
ఉదయం తినే బ్రేక్‌ఫాస్ట్ మీదే మనం రోజంతా ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. అంటే.. ఉదయాన్నే ఎలాంటి పోషకాలు లేని కేవలం కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తిన్నారనుకోండి.. సాయంత్రం వరకు నీరసంగా అనిపిస్తుంది. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్, బీపీ పెరిగిపోతాయి. ఉదయాన్నే లేట్ అయిపోతుందని ఏది కనిపిస్తే అది తినేసి వెళ్లిపోతుంటారు. ఇలా అస్సలు చేయకండి. మీరు ఉదయం ఆఫీస్‌కి లేట్ అవుతుందంటే రాత్రే తినడానికి కావాల్సినవి ప్రిపేర్ చేసి రెడీ చేసుకోండి. ఉదయాన్నే ఓట్స్‌తో ఏ రకమైన వంటకం చేసుకుని తిన్నా మంచిదే. సాయంత్రం వరకు ఉత్సాహంగా ఉంటారు.
బ్రేక్‌ఫాస్ట్‌లో తినకూడనివి
*ఉదయాన్నే కాఫీ తాగనిదే ఏ పనీ చేయలేరు. అలాగని బ్రష్ చేయగానే తాగేయకండి. కావాలంటే బ్రేక్‌ఫాస్ట్ తిన్నాక తాగండి. (breakfast)
*ఉదయాన్నే తాగకూడవి ఫ్రూట్ జ్యూస్‌లు. పండ్లలో ఉండే ఫైబర్ జ్యూస్‌లలో ఉండదు. దాంతో ఉదయాన్నే తాగితే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. కావాలంటే పండ్ల రసానికి బదులు నిమ్మ రసం, కీరాదోస రసం, సత్తు డ్రింక్ వంటివి తాగచ్చు.
*ఇప్పుడు మార్కెట్‌లో రెడీ టు ఈట్ తృణధాన్యాలు వస్తున్నాయి. అవి నేరుగా పాలల్లో వేసుకుని తినేస్తుంటారు. ఇవి అస్సలు మంచివి కావు. ఎందుకంటే వాటిలో ఉండే తృణధాన్యాలు ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. (breakfast)
*లేవగానే ప్యాన్ కేక్స్, వాఫిల్స్ జోలికి వెళ్లకండి. ఇవి సాయంత్రం స్నాక్స్‌గా తినే ఫుడ్స్.