Cholesterol: కొవ్వు పెంచని స్నాక్స్ ఇవే..!
Cholesterol: స్నాక్స్ అనగానే చెడు కొవ్వును పెంచేస్తాయేమో అని చాలా మంది భయపడుతుంటారు. అలాగని స్నాక్స్ తినకుండా ఉండలేం. మరేం చేయాలి? ఇలాంటప్పుడే అడుగు ఆచి తూచి వేయాలి. స్నాక్స్ తింటే కొవ్వు పెరుగుతుందన్న భయం ఉన్నప్పుడు తిన్నా కొవ్వు పెరగని స్నాక్స్ ఎంచుకోవాలి. అలాంటి స్నాక్స్ ఉంటాయా? ఏంటవి?
చనా చాట్
ఈ చనా చాట్ అనేది ఇప్పటిది ఏమీ కాదు. కాకపోతే ఉత్తర రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా తింటారు. ఈ చనా చాట్‌లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. చెడు కొవ్వు అస్సలు పెరగదు.
పెసర పప్పు దోస
దోస అందరికీ ఇష్టమే. కాకపోతే బియ్యం, మినపప్పుతో ఈ దోసలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ రెండు పదార్థాలతో చేసిన దోస కంటే పెసర పప్పుతో చేసుకునే దోసల్లో మంచి ప్రొటీన్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
మొలకల చాట్
మొలకలను ది బెస్ట్ స్నాక్ అని చెప్పుకోవచ్చు. కేవలం మొలకలు తినలేకపోతే అందులో రెండు మూడు రకాల పండ్ల ముక్కలు వేసుకుని తినండి. టేస్ట్‌కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం.
భేల్ పురీ
ఇది చాలా మందికి ఇష్టం. అన్ని చాట్ బండార్‌లలో ఈ స్నాక్ అమ్ముతుంటారు. పానీ పూరీలు, పావ్ బాజీల కంటే ఈ భేల్ పురీని తినండి.
రాగి చిప్స్
సాధారణ చిప్స్ కాకుండా రాగి పిండితో తయారుచేసిన చిప్స్ అమ్ముతుంటారు. మీరు చిప్స్‌ని ఇష్టపడేవారైతే ఈ రాగి చిప్స్ తెచ్చుకుని తింటే మంచిది.