Lung Cancer: పొగ తాగనివారికీ వస్తుందా?
Lung Cancer: ఊపిరితిత్తులకు స్వల్ప సమస్య వచ్చినా జీవితం నరక ప్రాయంలా మారుతుంది. ఊపిరి ఆడదు. ఏ పనీ చేయలేం. చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాంటిది లంగ్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తే ఇంకేమైనా ఉందా? ఈ లంగ్ క్యాన్సర్ ఎక్కువగా పొగ తాగే వారిలోనే కనిపిస్తుంటుంది. అయితే పొగ తాగని వారికి ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా?
లంగ్ క్యాన్సర్లు రెండు రకాలు. ఒకటి నాన్ స్మాల్ సెల్ కార్సినోమా (NSCLC). ఇంకోటి స్మాల్ సెల్ కార్సినోమా (SCLC). ఎక్కువగా మనం చూసే కేసులు NSCLCకి చెందినవి. SCLC కేసులు అరుదుగా కనిపిస్తుంటాయి. కానీ మొదటి దాని కంటే రెండోది చాలా డేంజర్. లంగ్ క్యాన్సర్ ఫలానా కారణం వల్లే వస్తుందని కచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు కానీ ప్రధాన కారణం మాత్రం పొగ తాగడమే. (lung cancer)
అయితే స్మోకింగ్ అలవాటు లేనివారికి లంగ్ క్యాన్సర్ రాదు అని చెప్పలేం. స్మోకింగ్ చేసేవారికే వస్తుందని కూడా చెప్పడానికి లేదు. కాకపోతే స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 99% ఉంది. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ స్మోకింగ్ అనేది ముఖ్యమైన పాయింట్ కాబట్టి.. పొగ తాగేవారి కంటే అది పీల్చేవారికి లంగ్ క్యాన్సర్ రిస్క్ మరీ ఎక్కువ. దీనినే ప్యాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. అంటే మీ పక్కన ఉన్నవారు స్మోక్ చేస్తుంటే మీరు రోజూ ఆ పొగ పీల్చుకుంటున్నట్లైతే మీకు రిస్క్ ఉన్నట్లే. ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. (lung cancer)