Fish Oil: ఎన్ని లాభాలో తెలుసా?
మీరు ఎప్పుడైనా గమనించినట్లైతే.. చికెన్ మటన్ వద్దు కావాలంటే చేపలు (fish oil) తినండి అని కొన్ని సందర్భాలల్లో వైద్యులు చెప్తుంటారు. ఎందుకంటే చేపలను డైట్‌లో భాగంగా చేసుకుంటే మనకు కలిగే మంచే ఎక్కువ ఉంది. కానీ కొందరికి చేప వాసన, వాటి రుచి పడదు. దాంతో వారు కనీసం సప్లిమెంట్స్ అయినా తీసుకుంటే బెటర్ అనుకుంటారు. అసలు ఏముంది ఈ ఫిష్ ఆయిల్‌లో? దీనిని తీసుకోవడం ద్వారా ప్రయోజనాలు ఏంటి?
అసలు ఫిష్ ఆయిల్ అంటే ఏంటి?
చేపల టిష్యూల నుంచి తీసే కొవ్వును ఫిష్ ఆయిల్ అంటాం. హెర్రింగ్, టూనా, ఆన్కోవీస్, మ్యాకెరెల్ వంటి ఆయిలీ చేపల నుంచే ఈ ఫిష్ ఆయిల్ లభిస్తుంది.
ఎంత శాతం చేపలు తినడం బెటర్?
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వారానికి ఒక ఫుల్ చేప తింటే బెటర్. (fish oil)
ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్‌తో లాభాలేంటి?
*గుండెకు ఎంతో మంచిది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.
*చేప నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కొన్ని రకాల మానసిక రోగాలను కూడా నయం చేస్తుందట. (fish oil)
*వయసు మీద పడుతున్నప్పుడు తగ్గే కంటి చూపుపై కూడా చేప నూనె ప్రభావం చూపుతుంది.
*వీటిలో స్ట్రాంగ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి కీళ్లవాతం వంటి ఇన్‌ఫ్లమేషన్ నుంచి వచ్చే రోగాలను నియంత్రిస్తుంది.
*చర్మం కూడా నిగ నిగలాడుతుంది.
*గర్భిణిలు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకుంటే కడుపులో బిడ్డ ఎదుగుదల బాగుంటుందట. కానీ ఇలాంటి విషయాల్లో పర్సనల్‌గా వైద్యులను సంప్రదిస్తే మంచిది. (fish oil)
*కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేస్తుంది.
*డిప్రెషన్‌తో బాధపడేవారికి కూడా ఇది మంచి థెరపీలా పనిచేస్తుంది.