Health: రన్నింగ్.. జాగింగ్.. వీటిలో ఏది మంచిది?
Health: రన్నింగ్.. జాగింగ్ ఈ రెండింటికీ పెద్ద తేడా లేదనుకుంటే పొరపాటే. జాగింగ్ (jogging) అంటే తేలిగ్గా చేసేది. రన్నింగ్ (running) అంటే ట్రెడ్ మిల్‌పై చేసినట్లు పరిగెత్తాలి. జాగింగ్ కంటే రన్నింగ్ చేస్తే ఎక్కువ కేలొరీలు కరుగుతాయి. అయితే ఆరోగ్యానికి ఈ రెండింట్లో ఏది మంచిదో తెలుసుకుందాం.
*రన్నింగ్ చేసేటప్పుడు మొదలుపెట్టిన కొన్ని సెకెన్లలోనే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. జాగింగ్ చేస్తే గుండె ఆరోగ్యానికి అంత లాభమేమీ ఉండదు. గుండె ఆరోగ్యం బాగుండాలంటే రన్నింగ్ బెటర్. (health)
*మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి జాగింగ్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే జాగింగ్ అనేది పెద్ద శ్రమతో కూడుకున్న పని కాదు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు రన్నింగ్ చేయలేరు. అలాగని అసలు శరీరానికి ఎలాంటి అలసట ఇవ్వకపోతే ఇంకా ప్రమాదం. అందుకే జాగింగ్ చేసుకుంటే మంచిది. ఒకవేళ రన్నింగ్‌పై మంచి పట్టు సాధించాలన్నా కూడా ముందు జాగింగ్‌తోనే మొదలుపెట్టాలి.
*మీరు ఇప్పుడిప్పుడే ఫిట్‌నెస్ వర్కవుట్స్ చేయాలనుకుంటున్నారా? అయితే ముందు జాగింగ్‌తో మొదలుపెట్టండి. ఆ తర్వాత నెమ్మదిగా రన్నింగ్.. ఇతర ఫిట్‌నెస్ వ్యాయామాలు అలవర్చుకోవచ్చు. ఎందుకంటే మీలో ఎంత సామర్ధ్యం ఉందో జాగింగ్ ద్వారా తెలిసిపోతుంది. (health)
*రన్నింగ్ ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ కేలొరీలు ఖర్చు అవుతాయి. ఒకవేళ మీకు జాగింగ్ అలవాటు ఉండి.. సమయం లేక చేయలేకపోతే రన్నింగ్ చేసుకోవచ్చు.
మీరు రన్నింగ్ చేయాలన్నా జాగింగ్ చేయాలన్నా మీ ఆరోగ్యం, సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది. ఎవరో చెప్తే దానిని పాటించేయడం కంటే మీ ఆరోగ్యం వివరాలన్నీ ఒకసారి వైద్యులను అడిగి తెలుసుకోవడం ఉత్తమం.