Dishware: ఏ పాత్రల్లో తినాలి?
Dishware: మనం వండటానికి వాడే పాత్రలే కాదు తినేందుకు వాడే పాత్రలు కూడా ఆచి తూచి ఎంచుకోవడం ముఖ్యం. నాన్‌స్టిక్ కుక్‌వేర్, ప్లాస్టిక్, అల్యుమినియం వంటి సామాగ్రికి దూరంగా ఉండాలని ఎప్పటినుంచో వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. వాటి బదులు స్టీల్, గాజు, ఐరన్ పాత్రలు వాడుకోవాలని సూచిస్తున్నారు. వంటకాలకు ఒకే.. మరి తినేందుకు ఏ పాత్రలు ఉపయోగించాలో తెలుసుకుందాం.
గాజు (glass)
గాజు పాత్రలను మించిన సేఫ్ డిష్‌వేర్‌లు మరేదీ లేదు. గాజు పాత్రల్లో ఏం తిన్నా కూడా విషపూరితమైనవి ఏవీ కూడా మన ఆహారంలో కలవవు. వేడి, చల్లని పదార్థాలను ఈ గ్లాస్ వేర్ బెస్ట్. శుభ్రం చేయడం కూడా సులువే.
రాగి (copper)
రాగి ఎంతో ఆరోగ్యకరమైన మెటల్. ఒకవేళ రాగి పాత్రలకు ఏదైనా హానికరమైన బ్యాక్టీరియా ఉన్నా కూడా అది చంపేస్తుంది.
వెదురు (bamboo)
వెదురుతో తయారుచేసిన పాత్రలను కూడా ఈ మధ్యకాలంలో విరివిగా అమ్ముతున్నారు. తక్కువ బరువు ఉంటాయి. వీటిపై వేసే కోటింగ్ వల్ల కూడా ఎలాంటి హాని ఉండదు.
స్టీల్ (steel)
ఇప్పుడు అందరి ఇళ్లల్లో స్టీల్ మాత్రమే ఎక్కువగా వాడుతున్నారు. ఇతర పాత్రలను వాడాలా వద్దా అనే సందేహం ఉన్నవారు కళ్లు మూసుకుని స్టీల్ పాత్రలు కొనేసుకోవచ్చు. ఇందులో వండినా కూడా ఎలాంటి ప్రమాదమూ ఉండదు.
సెరామిక్ (ceramic)
సెరామిక్ పాత్రలు కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయాయి. వీటిని డైనింగ్ టేబుల్ మీద పెడితే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి కూడా.