Health: మ‌ధ్యాహ్నం నిద్ర‌పోవ‌డం మంచిది కాదా.. వైద్యులు ఏం చెప్తున్నారు?

Health: కొంద‌రికి రాత్రి వేళ‌ల్లో నిద్ర ప‌ట్ట‌దు కానీ మ‌ధ్యాహ్న స‌మ‌యంలో మాత్రం నిద్ర ముంచుకొచ్చేస్తుంది. చాలా మంది అలాగే ఎక్కువ గంట‌లు నిద్ర‌పోతుంటారు. దాంతో రాత్రి వేళల్లో నిద్ర ప‌ట్ట‌క ఇబ్బంది ప‌డుతుంటారు. అస‌లు మ‌ధ్యాహ్న స‌మ‌యంలో నిద్రపోతే మంచిదా కాదా? అస‌లు వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం.

మ‌ధ్యాహ్న స‌మ‌యాల్లో నిద్ర‌పోవ‌డం మంచిదే కానీ నిద్ర 20 నుంచి 30 నిమిషాల వ‌ర‌కు మాత్ర‌మే ఉండాలి. అంత‌కంటే ఎక్కువ సేపు నిద్ర‌పోకూడదు. అంత‌కుమించి ఎక్కువ సేపు నిద్ర‌పోతే రాత్రి స‌మ‌యంలో నిద్ర ప‌ట్ట‌క ఎక్కువ సేపు మేల్కుని ఉంటారు. దాని వ‌ల్ల తిన్న‌ది స‌రిగ్గా జీర్ణం కాక ఇబ్బందులు వ‌స్తాయి. ఒక్కసారి మ‌ధ్యాహ్నం పూట ఎక్కువ సేపు ప‌డుకోవ‌డం అల‌వాటు చేసుకుంటే రాత్రి నిద్ర ఉండ‌దు కాబ‌ట్టి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయని వైద్యులు చెప్తున్నారు. ఎంత ప్ర‌య‌త్నించినా మ‌ధ్యాహ్న స‌మ‌యంలో ఎక్కువ సేపు నిద్ర‌పోతుంటే ఒక‌సారి వైద్యుల‌ను సంప్ర‌దించి దానికి సొల్యూష‌న్ తెలుసుకోవాల‌ని.. అలా కాకుండా అలవాటైంది క‌దా అని ఎక్కువ సేపు ప‌డుకోకూడ‌ద‌ని చెప్తున్నారు.