Health: సెక్స్‌కి దూర‌మైతే.. అకాల మ‌ర‌ణ ముప్ప‌ట‌..!

what will happen if one does not do sex

Health: శృంగారం అనేది ఒత్తిడి త‌గ్గించే ప్ర‌క్రియ అని చెప్తుంటారు. ఒక రకంగా వ్యాయామం చేసిన‌ట్లే. అయితే మ‌గ‌వారితో పోలిస్తే ఆడ‌వారు ఈ శృంగారానికి చాలా దూరంగా ఉంటున్నార‌ట‌. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్లో, అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్లో, అనాస‌క్తి వ‌ల్లో నెల‌లో ఒక‌సారి కూడా ఆ ఎంజాయ్‌మెంట్‌కి నోచుకోలేక‌పోతున్నార‌ని ప‌లు నివేదిక‌లు చెప్తున్నాయి. అయితే వారంలో ఒక‌సారైనా శృంగారం చేసే ఆడ‌వాళ్ల‌తో పోలిస్తే.. మ‌రీ త‌క్కువ సార్లు సెక్స్ చేసే ఆడ‌వాళ్ల‌లో అకాల మ‌ర‌ణ ముప్పు అధికంగా ఉంద‌ని వైద్యులు చెప్తున్నారు.  క‌నీసం వారానికి ఒక‌సారైనా సెక్స్ చేయాల్సిందేన‌ట‌. వారంలో ఎక్కువ సార్లు సెక్స్ చేస్తే లాభాలు ఉండ‌క‌పోవ‌చ్చు కానీ అస‌లు చేయ‌క‌పోతే మాత్రం అనారోగ్య స‌మ‌స్య‌లు త‌ప్పవు.

రెగ్యుల‌ర్ సెక్స్ వ‌ల్ల ఉప‌యోగాలేంటి?

రెగ్యుల‌ర్‌గా సెక్స్ చేస్తుంటే ఎండార్ఫిన్స్, ఆక్సిటాజిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు. అంటే ఒత్తిడిని త‌గ్గించి చురుగ్గా ఉండేలా చేస్తాయి.

త‌ర‌చూ సెక్స్ చేసే వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి బాగుంటుంద‌ట‌. అనారోగ్య స‌మ‌స్య‌లు, ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చినా వెంట‌నే త‌గ్గిపోతాయి.

గుండె ప‌నితీరు మెరుగుప‌డుతుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగుంటుంది.

నిద్ర పట్టేందుకు దోహ‌ద‌ప‌డే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ బాగా ప‌నిచేస్తుంది.

ఎక్కువ‌గా శృంగారం చేసే మ‌హిళ‌ల్లో డిప్రెష‌న్ ఛాయ‌లు క‌నిపించ‌వు.

తక్కువ‌గా సెక్స్ చేసే మ‌హిళ‌ల్లో.. అస‌లు సెక్సే చేయ‌ని మ‌హిళ‌ల్లో అకాల మ‌ర‌ణ ముప్పు 197% అధికంగా ఉంది.