ఎక్కువ నీళ్లు తాగి చ‌నిపోయిన మ‌హిళ‌.. అస‌లేంటీ వాట‌ర్ ఇన్‌టాక్సికేష‌న్?

what is Water Intoxication and why is it dangerous

Water Intoxication: శ‌రీరానికి నీటి అవ‌స‌రం ఎంతో ఉంది. రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు త‌ప్పనిస‌రిగా తాగాల‌ని చెప్తుంటారు. కానీ అదే ప‌నిగా నీళ్లు తాగితే ప్రాణాల‌కే ప్ర‌మాదం అనే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విష‌యం తెలీక అమెరికాకి చెందిన ఓ మ‌హిళ అధిక మొత్తంలో నీళ్లు తాగి చ‌నిపోయింది. దీనిని వాట‌ర్ ఇన్‌టాక్సికేష‌న్ అంటారు.

వాట‌ర్ ఇన్‌టాక్సికేష‌న్ అంటే ఏంటి?

మ‌న శ‌రీరంలో అత్య‌ధికంగా నీరు చేరేది రెండు కార‌ణాల వ‌ల్ల. ఒక‌టి వేగంగా అత్య‌ధిక నీళ్లు తాగేయడం వ‌ల్ల‌.. రెండు కిడ్నీలు నీటిని నిల్వ ఉంచుకోవ‌డం వ‌ల్ల‌. అత్య‌ధికంగా నీళ్లు తాగేస్తే కిడ్నీలపై భారం ప‌డి మ‌లినాల‌ను బ‌య‌టికి పంప‌లేక‌పోతుంది. దాని వ‌ల్ల శ‌రీరంలోని ఎల‌క్ట్రోలైట్లు డైల్యూట్ అయిపోతాయి. ఈ ప్ర‌క్రియ‌లో శ‌రీరంలోని ఉప్పు కూడా డైల్యూట్ అయిపోయి హైపోనాట్రేమియా అనే స‌మ‌స్య వ‌స్తుంది. దీనిని ఓవ‌ర్ హైడ్రేష‌న్ అంటారు. అంటే శ‌రీరంలో ఉండాల్సిన దాని కంటే అత్య‌ధిక మోతాదుల్లో నీరు చేరుతుంది. దీనినే వాటర్ ఇన్‌టాక్సికేష‌న్ అంటారు.

దీని ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి?

త‌ల‌నొప్పి

వాంతులు అవుతుండ‌డం

నీర‌సం

క‌న్‌ఫ్యూజన్

కండ‌రాల నొప్పులు

మ‌నం గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే.. ఎవ‌రో ఏదో చెప్పార‌ని ఎక్కువ నీళ్లు తాగేయ‌డం అనేది చాలా ప్ర‌మాద‌క‌రం. కావాలంటే మీ బాడీని ఓసారి చెక‌ప్ చేయించుకుని వైద్యుల స‌ల‌హా మేర‌కు తాగండి. మ‌న కిడ్నీల‌కు గంట‌కు ఒక లీట‌ర్ నీటిని మాత్ర‌మే ప్రాసెస్ చేసుకుంటాయి. కాబ‌ట్టి దాని కంటే ఎక్కువ తాగితే ప్ర‌మాద‌మే.