ఇవి ఎక్కువ సేపు వేయిస్తే క్యాన్సర్‌ను ఆహ్వానించినట్లే
What food causes cancer కొన్ని రకాల ఆహార పదార్థాలను బాగా వేయిస్తేనే రుచి. వేగకుండా తింటే కడుపు నొప్పి వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. మరికొన్ని ఆహార పదార్థాలను ఎక్కువ సేపు వేయిస్తే అవి విషంగా మారతాయి. వాటి వల్ల క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఏంటా ఆహార పదార్థాలు?
మాంసాన్ని పెద్ద మంటపై వేయించినా, గ్రిల్ చేసినా మంచిది. ఇలా వేయించడం వల్ల ఆ మాంసం నుంచి వెలువడే ఓ కెమికల్ ఏకంగా మన DNAనే మార్చేస్తుంది. దీని వల్ల ట్యూమర్లు ఏర్పడతాయి.
ఆలుగడ్డను ఎక్కువ సేపు వేయించడం వల్ల ఆక్రిలమైడ్ అనే ప్రమాదకరమైన కెమికల్ విడుదల అవుతుంది. ఇది అస్సలు మంచిది కాదు.
ఆకుకూరల్లో నైట్రేట్స్ ఉంటాయి. ఎక్కువ సేపు వేయించినా వండినా అందులోనే నైట్రేట్స్ కాస్తా నైట్రైట్స్‌గా మారతాయి. నైట్రేట్స్ వేరు నైట్రైట్స్ వేరు. ఈ నైట్రైట్స్ వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయి.
బియ్యం వంటివి కూడా ఎక్కువ సేపు వేయించినా వండినా అక్రిలమైడ్ రిలీజ్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే బియ్యాన్ని ఎక్కువ సేపు వేయించకుండా ఉడకబెట్టుకుంటే మంచిది.
తేనెను వేడి చేసినా.. వేడి నీళ్లల్లో కానీ పాలల్లో కానీ వేసుకున్నా దాని నుంచి HMF (హైడ్రాక్సీ మిథైల్ ఫుర్ఫురాల్) అనే ప్రమాదకరమైన రసాయనం వెలువడుతుంది. అందుకే అంటారు తేనెను వేడి చేస్తే అది కాస్తా విషంలా మారుతుందని.