Cashew: జీడిపప్పు ఎందుకు తినాలి?
కొన్ని రకాల వంటల్లో జీడిపప్పు (cashew) వేస్తే దానికి వచ్చే రుచే వేరు. కానీ దీనిని మనం రోజూ తినం. ఎప్పుడో పండుగల సమయంలో పాయసం లాంటి స్పెషల్ వంటకాలు చేసినప్పుడు అందులో యాడ్ చేసుకుంటాం. లేదా అమ్మ ఇంట్లో ఉప్మా చేసేటప్పుడు అందులో నాలుగు జీడిపప్పు పలుకులు వేసి చేస్తుంటారు. అయితే ఈ జీడిపప్పుని మన డైట్‌లో భాగం చేసుకోవాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం.
గుండెతో ఎంతో మంచిది (heart health)
జీడిపప్పుని డైట్‌లో భాగంగా చేసుకోవడం వల్ల గుండెకు ఎంతో మంచిదట. చెడు కొలెస్ట్రాల్ అయిన LDLను ఇది తగ్గిస్తుంది.
రక్తానికి సంబంధించిన రోగాలు రావు (blood purifier)
జీడిపప్పుని తింటే రక్తానికి సంబంధించిన రోగాలు కూడా రావట. అంటే జీడిపప్పు బ్లడ్ ప్యూరిఫైయర్‌లానూ పనిచేస్తుందన్నమాట. (cashew)
కళ్లకు మేలు (eye health)
జీడిపప్పులో ఉన్న కొన్ని రకాల పోషకాలు మన కళ్లల్లోని రెటీనాపై (retina) యూవీ కిరణాలు (uv rays) పడకుండా ప్రొటెక్టివ్ లేయర్‌ను ఫార్మ్ చేస్తుందట. ఫలితంగా కంటి చూపు బాగుంటుంది.
ఇమ్యూనటీ బాగుంటుంది (immunity)
ఎన్నో రకాల విటమిన్లు, జింక్ జీడిపప్పుల్లో ఉండటం వల్ల వీటిని వారంలో మూడు, నాలుగు సార్లు తీసుకుంటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. (cashew)
బరువు తగ్గుతారు (weight loss)
జీడిపప్పుల్లో ఒమెగా 3 ఎక్కువగా ఉండటం వల్ల బరువు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఎముకలు బలపడతాయి (bone health)
జీడిపప్పుల్లో అధికంగా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి ఎముకలను పటిష్టం చేస్తాయి. (cashew)
మెదడుకు ఎంతో మేలు (brain health)
వీటిలో ఫ్యాటీ యాసిడ్స్, బ్రెయిన్ బూస్టింగ్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది.