Heart Health: సింపుల్ యూరిన్ టెస్ట్ చాలు..!
గుండె ఆరోగ్యం (heart health) ఎలా ఉందో తెలుసుకోవడానికి సింపుల్ యూరిన్ టెస్ట్ చాలట. యూరిన్ టెస్ట్ రిజల్ట్స్‌లో ఆల్బ్యుమిన్ (albumin), క్రియాటినైన్ (creatinine) శాతం ఎక్కువగా ఉంటే గుండె సమస్యలు దారిలో ఉన్నట్లే లెక్క. గుండెకు రక్తం సరిగ్గా సరఫరా అవ్వకపోతే హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. గుండె కండరాలు టైట్ అయిపోయినప్పుడు.. హైపర్ టెన్షన్, షుగర్ సమస్యలు ఉన్నప్పుడు గుండెకు రక్త సరఫరా నెమ్మదిస్తుంది. ఇప్పుడు బాగానే ఉంది కదా అంటే గుండె పనితీరు కూడా బాగానే ఉంటుందిలే అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఈ సమస్యలన్నీ ఏర్పడటానికి కొన్నేళ్లు పడుతుంది. కరెక్ట్‌గా ఫలానా టైంకి గుండె సమస్యలు వస్తాయని చెప్పలేం కాబట్టి ఆరు నెలలకోసారి యూరిన్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలని యూరోపియన్ జర్నల్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ చేసిన రీసెర్చ్‌లో తేలింది. (heart health)
యూరిన్ మార్కర్స్ అంటే ఏంటి?
కిడ్నీ నుంచి ఆల్బ్యుమిన్, క్రియాటినైన్ ఎంత లెవెల్‌లో విడుదల అవుతుందో టెస్ట్‌లో ఈ యూరిన్ మార్కర్స్ చెప్పేస్తాయి. ఇవి అధిక లెవెల్స్‌లో ఉంటే మాత్రం అన్ని రకాల జబ్బులు ఉన్నట్లే. త్వరగా మరణం సంభవించే ప్రమాదం ఉంది. మన కిడ్నీలు బాగున్నాయి అంటే గుండె కూడా పదిలంగా ఉన్నట్లే. మన శరీరంలో ఉండే అతిపెద్ద ప్రొటీన్ ఆల్బ్యుమిన్. ఇది రక్తంలో కలిసే శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా అవుతూ ఉంటుంది. ఇది కానీ యూరిన్‌లో కనిపించింది అంటే ప్రమాదం పొంచి ఉన్నట్లే. యూరిన్ టెస్ట్ చేయించుకున్నప్పుడు సోడియం, గ్లూకోస్ మాలిక్యూల్స్ ఉంటే ఫర్వాలేదు కానీ ఈ ఆల్బ్యుమిన్ ప్రొటీన్ మాత్రం అస్సలు ఉండకూడదు. (heart health)
సీరమ్ క్రియాటినైన్
ఈ సీరమ్ క్రియాటినైన్ అనేది యూరిన్‌లో పోతుంటే మాత్రం కిడ్నీలు వేస్ట్ పార్టికల్స్‌ని ఫిల్టర్ చేయడంలేదని అర్థం. ఇక్కడ కిడ్నీలు, గుండె ఒకదానితో ఒకటి లింక్ అయివుంటాయి. గుండె సమస్య ఉంటే ఆటోమేటిక్‌గా కిడ్నీల సమస్య కూడా వస్తుంది. అదే విధంగా కిడ్నీల పనితీరులో ప్రాబ్లం ఉన్నా కూడా గుండె సమస్యలు వస్తాయి.
ఎంత లెవల్స్‌లో ఉండాలి?
ఇక ఈ ఆల్బ్యుమిన్, క్రియాటినైన్ లెవల్స్ ఏ లెవల్‌లో ఉంటే మంచిది అంటే.. 30 mg/g కంటే తక్కువగా ఉండాలి. 30 mg/g కంటే లెవెల్స్ తక్కువగా ఉంటే బెటర్. 39 ఉంటే కాస్త రిస్క్‌లో ఉన్నట్లే. అంతకంటే ఎక్కువ.. అంటే 300 mg/g ఉందంటే మాత్రం ఏ క్షణానైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నట్లు. (heart health)