Perfume: రోజంతా ప‌రిమ‌ళిస్తూనే ఉండాలంటే ఇలా చేయండి

ఆఫీస్‌, పార్టీలు ఇలా వేడుక ఏదైనా స‌రే.. సెంట్ లేదా పెర్ఫ్యూమ్ (perfume) కొట్టుకుని వెళ్తాం. తీరా చూస్తే మ‌నం కొట్టుకున్న సెంట్ వాస‌న రాదు కానీ ప‌క్క‌వారు వేసుకున్న‌ పెర్ఫ్యూం వాస‌న మాత్రం గుప్పుమ‌ని వ‌స్తుంది. అస‌లు మ‌నం కొట్టుకున్న సెంట్ వాస‌న ఎందుకు రాద‌బ్బా అని చాలా సార్లు అనుకుని ఉంటాం. సెంట్ లేదా పెర్ఫ్యూంను వాడేందుకు కూడా ఒక ప‌ద్ధ‌తి ఉంది.

*చ‌ర్మం ఎప్పుడైతే హైడ్రేటెడ్‌గా ఉంటుందో అప్పుడే పెర్ఫ్యూం రోజంతా నిలుస్తుంది. పొడిబారిన చ‌ర్మంపై ఎప్ప‌టిక‌ప్పుడు సెంట్ కొట్టుకుంటూనే ఉండాలి. అందుకే ఈసారి ఎక్క‌డికైనా వెళ్లేట‌ప్పుడు కాస్త మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకుని దానిపై సెంట్ కొట్టుకోండి.

*ఎప్పుడైనా కూడా సెంట్ లేదా పెర్ఫ్యూమ్స్‌ని ర‌క్త‌నాళాల ద‌గ్గ‌ర రాసుకోవాలి. అంటే ప‌ల్స్ (నాడి) పాయింట్స్‌, చెవి వెనుక భాగం, మెడ ద‌గ్గ‌ర రాసుకోవాలి. ఎందుకంటే అక్క‌డ ర‌క్త‌నాళాలు ఉంటాయి కాబ‌ట్టి వేడి పుడుతూ ఉంటుంది. సెంట్ కొట్టుకున్నాక ఆ వేడి వ‌ల్ల అది రోజంతా ప‌రిమ‌ళిస్తుంటుంది. (perfume)

*మీ ద‌గ్గ‌ర ఉన్న పెర్ఫ్యూమ్ మాదిరిగానే అదే వాస‌న వ‌చ్చేలా ఉన్న బాడీ వాష్‌తో స్నానం చేయండి. అప్పుడు రాత్రి వ‌ర‌కు మీరు కొట్టుకున్న పెర్ఫ్యూమ్ వాస‌న పోకుండా ఉంటుంది.

*కేవ‌లం చ‌ర్మంపైనే కాదు దుస్తుల‌పైనా సెంట్ కొట్టుకోవాలి. అందులోనూ కాట‌న్, ఉన్ని దుస్తుల‌పై మాత్ర‌మే సెంట్ వాస‌న ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. జాగ్ర‌త్త‌.. అన్ని దుస్తుల‌పైనా స్ప్రే చేసుకోకూడ‌దు. ఎందుకంటే మ‌ర‌క‌లు ప‌డ‌తాయి.

*మీ దువ్వెన‌పై ఒక రెండు సార్లు పెర్ఫ్యూమ్‌ని స్ప్రే చేయండి. ఇప్పుడు ఆ దువ్వెన‌తోనే దువ్వుకోండి. ఈ టిప్ వ‌ల్ల రెండు రోజుల పాటు సెంట్ వాస‌న పోకుండా ఉంటుంది.  (perfume)