Migraine వచ్చినప్పుడల్లా ట్యాబ్లెట్ వేస్తున్నారా?
మైగ్రేన్.. (migraine) ఈ పదం వినగానే తలనొప్పి మొదలైపోతుంది. ఓ రీసెర్చ్‌లో మైగ్రేన్ నొప్పి ఆల్మోస్ట్ గుండెనొప్పి వచ్చినంత నొప్పిగా ఉంటుందని తేలింది. పీరియాడికల్‌గా వచ్చే ఈ నొప్పికి ట్రీట్మెంట్ లేదనే చెప్పాలి. కొందరికి ఓ నార్మల్ తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. మరికొందరికి ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా దానికి నొప్పి చిక్కదు. దాదాపు రెండు రోజుల పాటు మనిషిని పీక్కుతినేదాకా వదలదు. మరి ఈ మైగ్రేన్ వచ్చిన ప్రతీసారీ ట్యాబ్లెట్ వేసుకుంటే అది వేరే సమస్యలకు దారి తీస్తుంది కాబట్టి.. ఇంట్లోనే ఈ సహజమైన టిప్స్‌ని పాటించి చూడండి. (migraine)
డీహైడ్రేషన్ (de hydration)
ఒక్కోసారి శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోయినా మైగ్రేన్ వస్తుంది. ఒకవేళ తలనొప్పి మొదలైనట్లు అనిపిస్తే ఒక బాటిల్ వాటర్ తాగి చూడండి. తాగిన కొన్ని నిమిషాల తర్వాత నొప్పి తగ్గుతుంటే.. మీకు డీహైడ్రేషన్ వల్ల మైగ్రేన్ వస్తోందని అర్థం.
ఆక్యుప్రెషర్ (accupressure)
కొన్ని పెయిన్ పాయింట్లను పట్టుకుని ఆక్యు ప్రెషర్ అప్లై చేసినా కూడా మైగ్రేన్ తగ్గే ఛాన్స్ ఉంది. ఆక్యు ప్రెషర్ వల్ల ఒంట్లో కండరాలు రిలాక్స్ అవుతాయి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. (migraine)
సరైన నిద్ర (sleep)
నిద్రలేకపోయినా మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది. అంతేకాదు.. ఎప్పుడూ నిద్రపోయే టైంలో కాకుండా కాస్త టైం అటూ ఇటూ అయినా కూడా తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. అందుకే నిద్రపోవడానికి నిద్ర లేవడానికి ఒక సమయం కేటాయించుకోండి.
నూనెలు (essential oils)
ల్యావెండర్, రోస్‌మేరీ, యూకలిప్టస్ వంటి నూనెలతో కాస్త మెడ భాగాన్ని మర్దనా చేసుకుని చూడండి. నొప్పి తగ్గే అవకాశం ఉంది. (migraine)
కాఫీ లేదా టీ (coffee or tea)
తలనొప్పి వస్తోందంటే చాలా మంది కప్పు టీ లేదా కాఫీ తాగుతుంటారు. సాధారణ తలనొప్పి వచ్చినప్పుడు తాగితే తగ్గే అవకాశం ఉందేమో కానీ మైగ్రేన్ ఉన్నప్పుడు తాగితే 80% వరకు తగ్గకపోవచ్చు. ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు టీ కాఫీలు తాగితే వాంతులు అయిపోతాయి. అలా వాంతులు అయినప్పుడు ఆపకూడదు. కడుపులోని పసరు అంతా బయటికి వచ్చేస్తేనే బెటర్. అప్పుడు నొప్పి తగ్గిపోతుంది.