Oily Food: నూనె వస్తువులు తిన్నాక ఇలా చేయాల్సిందే..!
Oily Food: కొన్నిసార్లు తెలీకుండా ఎక్కువగా నూనె వస్తువులు తినేస్తుంటాం. పండుగల సమయంలో నూనె లేకుండా ఏ స్పెషల్ వంటకాన్ని కూడా తయారుచేయలేం. ఆ సమయంలో కాస్త ఎక్కువే తింటాం. అయితే ఎప్పుడు తిన్నా కూడా ఎక్కువ నూనె ఆరోగ్యానికి మంచి కాదు కాబట్టి… ఒకవేళ మీకు నూనె వస్తువులు ఎక్కువగా తినేసామే అనిపిస్తే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.
వేడి నీళ్లు తాగండి (warm water)
మీ భోజనం అయ్యాక ఒక గంట తర్వాత ఒక గ్లాసు వేడి (గోరు వెచ్చని) నీళ్లు తాగండి. నూనెతో చేసిన ఆహార పదార్థాలను చిన్న ముక్కలుగా చేసి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
గ్రీన్ టీ (green tea)
నూనెతో చేసిన ఆహార పదార్థాలు తింటే కడుపు మాట వినదు. జీర్ణం సరిగ్గా అవ్వదు. చిరాగ్గా ఉంటుంది. దాని వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే కప్పు గ్రీన్ టీ తాగి చూడండి. (oily food)
పెరుగు (curd)
పెరుగులో ప్రోబయెటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే పెరుగులో కాస్త వేయించిన జీలకర్ర వేసుకుని తినండి. నూనె వస్తువుల కారణంగా వచ్చే ఎసిడిటీ సమస్యలు రాకుండా ఉంటాయి.
నిద్ర (sleep)
నూనె వస్తువులు తినగానే కడుపు భారంగా ఉంటుంది. దాంతో వెంటనే నిద్ర వచ్చేస్తుంది. తిన్న వెంటనే అస్సలు నిద్రపోకండి. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. (oily food)
ఐస్ క్రీం (ice cream)
నూనె వస్తువులు తిన్నాక ఐస్‌క్రీం జోలికి పోకండి. కడుపులో ఆల్రెడీ నూనె పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఐస్‌క్రీం వంటివి తింటే కడుపు ఉబ్బరం పెరిగిపోయి వికారంగా అనిపిస్తుంది.