Rice: అన్నం ఎక్కువ‌గా తినేస్తున్నారా?

రోజు మొత్తంలో ఏది తిన్నా తిన‌క‌పోయినా అన్నం (rice) లేనిదే క‌డుపు నిండిన‌ట్లు అనిపించ‌దు. కొన్ని రాష్ట్రాల్లో చిన్న క‌ప్పు అన్నం తింటే మిగ‌తా ఆహారంలో రోటీలు, స‌లాడ్స్ తింటుంటారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో భోజ‌నం అంటే కేవ‌లం అన్నం, ప‌ప్పు, సాంబార్, ర‌సం, పెరుగు ఇలా అన్నీ ఉంటేనే తిన‌గ‌లుగుతారు. అయితే కొంద‌రు మాత్రం తెలీకుండా కానీ లేదా ఆక‌లితో కానీ అన్నం ఎక్కువ‌గా తినేస్తుంటారు. ఇప్పుడు మ‌నం తినేది పాలిష్డ్ బియ్యంతో వండిన అన్నం. దాని వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం ఏమీ ఉండ‌దు. అందుకే అన్నం లిమిట్ తినాల‌నుకున్నా అలా తిన‌లేక‌పోతున్న వారికోసం ఈ టిప్స్. (health)

*పెద్ద పెద్ద కంచాల్లో కాకుండా చిన్న ప్లేట్‌లో భోజ‌నం చేయ‌డం అల‌వాటు చేసుకోండి. అప్పుడు త‌క్కువ మొత్తంలో అన్నం వేసుకుని తింటారు.

*ఒక క‌ప్పు అన్నం వేసుకుంటే రెండు క‌ప్పుల ప‌ప్పు కానీ సాంబార్ కానీ క‌ర్రీ కానీ ఉండాలి. ఎప్పుడూ కూడా అన్నం కంటే దానిలో క‌లుపుకునే వంట‌కం క్వాంటిటీ ఎక్కువ‌గా ఉండాలి. (rice)

*మీరు అన్నం ఎక్కువ‌గా తింటున్నారు అంటే దాని అర్థం మీరు అస‌లు పీచు తిన‌కుండా కేవ‌లం కార్బోహైడ్రేట్స్ తింటున్నార‌ని.

*ఎప్పుడూ కూడా మీరు ఏది తిన్నా దానిలో ప్రొటీన్, ఫైబర్ క‌చ్చితంగా ఉండేలా చూసుకోండి. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉన్న ఆహారం తింటే క‌డుపు త్వ‌రగా నిండిపోయిన‌ట్లు అనిపిస్తుంది.

*ఒక‌వేళ మీరు ఏ రోజైతే ఫైబ‌ర్ లేని వంట‌లు వండారో అప్పుడు మీరు తినే స‌మ‌యంలో ప‌చ్చి ఆకుకూర‌ల‌ను శుభ్రంగా క‌డిగి వాటిని స‌లాడ్‌లాగా తినండి.  (rice)

*రోజూ అన్నం తినేట‌ప్పుడు ప‌క్క‌నే రెండు గుడ్లు పెట్టుకోండి. దాని వ‌ల్ల అన్నం ఎక్కువ‌గా తిన‌కుండా ఉంటారు.

*అన్నం తింటున్న స‌మ‌యంలో కొద్ది కొద్దిగా నీళ్లు కానీ మ‌జ్జిగ కానీ తాగుతూ ఉండండి. దాని వ‌ల్ల క‌డుపు త్వ‌ర‌గా నిండిపోతుంది.  (rice)

*తినేట‌ప్పుడు ఒక్కో ముద్ద‌ను 15 నుంచి 20 సార్లు న‌మిలేలా చూసుకోండి. అప్పుడే కావాల్సినంత మాత్ర‌మే తిన‌గ‌లుగుతాం.