Air Pollution: కాలుష్యం వల్ల గొంతు నొప్పిగా ఉందా.. ఈ టిప్స్ మీకోసమే
Air Pollution: ఇంట్లో ఎయిర్ క్లీనర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టించేసుకుంటే వాయు కాలుష్యం నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటాం. కానీ ఇది అపోహ మాత్రమే. కొంత వరకు స్వచ్ఛమైన గాలిని పీల్చగలిగాలా ఈ ప్యూరిఫైయర్లు తోడ్పడతాయి కానీ ఇవి ఇంట్లో ఉన్నంత మాత్రాన రోగాల బారిన పడకుండా ఉంటామన్న గ్యారెంటీ లేదు.
ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ చేసిన రీసెర్చ్‌లో ఈ విషయం బయటపడింది. ఇంట్లో ఉన్నా బయటికి వెళ్లినా కాలుష్యం కారణంగా మొదట దెబ్బతినేది ఊపిరితిత్తులు. అది కూడా ముందు గొంతు నొప్పి, దగ్గుతో మొదలై నెమ్మదిగా ఊపిరితిత్తులకు సోకుతుంది. అయితే గొంతు నొప్పిగా కానీ విపరీతమైన దగ్గు ఉన్నా కానీ ఈ టిప్స్ పాటించి చూడండి. అయినా కూడా తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందే.
మీకు చాయ్ తాగే అలవాటు ఉంటే కాస్త అల్లం ఎక్కువ వేసుకుని వేడిగా చాయ్ తాగి చూడండి. వెంటనే సాంత్వన కలుగుతుంది. చాయ్ తాగే అలవాటు లేకపోతే గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుకిలించండి. ఇది కూడా మంచి బాగా పనిచేస్తుంది. పాలతో టీ తాగే అలవాటు లేకపోతే ఒక కప్పు నీటిలో కాస్త పసుపు వేసుకుని మరిగించండి. గోరువెచ్చగా అయ్యాక తేనె వేసుకుని తాగండి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అందులోనూ ఇది చలికాలం కాబట్టి నీళ్లు తాగాల్సి వచ్చిన ప్రతీసారి గోరువెచ్చని నీటినే తాగేందుకు ప్రయత్నించండి. ఇంట్లో వారు కూడా వేడి నీళ్లు తాగు సర్దుకుంటుంది అని చెప్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి.. వేడి నీళ్లు అంటే గోరు వెచ్చని నీళ్లు (వార్మ్ వాటర్) అని అర్థం. అంతేకానీ నాలుక తట్టుకుంటున్నా కూడా మరీ వేడిగా తాగకూడదు. ఇది చాలా ప్రమాదకరం. బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. ఒకవేళ మీరు క్లాత్ మాస్క్ వాడుతున్నట్లైతే రోజూ దానిని ఉతకాల్సిందే. (air pollution)