Eyes: క‌ళ్ల‌కూ ఉంది యోగా..!

Hyderabad: యోగా (yoga) శ‌రీరానికే కాదు.. క‌ళ్ల‌కూ (eyes) ఉంది తెలుసా? క‌ళ్ల చేత ఈ చిన్న ఆస‌నాలు వేయిస్తే క‌ళ్ల‌ద్దాలు పెట్టుకునే ప‌రిస్థితి రాదు. ఇప్పుడున్న లైఫ్‌స్టైల్ వ‌ల్ల ఆల్మోస్ట్ 18 గంట‌ల పాటు పిల్ల‌లు కానీ పెద్దలు కానీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ముందే ఉంటున్నారు. దాంతో చిన్న వ‌యసులోనే కంటి చూపు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే ఉద్యోగాలు చేసేవారికి ల్యాప్‌టాప్ లేదా సిస్ట‌మ్ ముందు కూర్చోక త‌ప్ప‌దు. కాబ‌ట్టి.. క‌ళ్లు దెబ్బ‌తిన‌కుండా ఉండేందుకు ఈ చిన్న పాటి ఎక్సర్‌సైసెజ్ చేయండి.

*రెండు చేతుల‌ను రుద్దిన‌ప్పుడు థ‌ర్మ‌ల్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలా చేతులు బాగా రుద్ది క‌ళ్ల‌పై (eyes) పెట్టుకోండి. ఆ థ‌ర్మ‌ల్ హీట్ వ‌ల్ల క‌ళ్ల చుట్టూ ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంది.

*5 నిమిషాల పాటు ప్ర‌తి నిమిషానికి 15 సార్లు క‌నురెప్ప‌ల‌ను ఆర్పేందుకు ప్ర‌య‌త్నించండి. క‌ళ్లు (eyes) పొడిబార‌కుండా ఉంటాయి.

*క‌ళ్ల‌ని గుండ్ర‌గా తిప్పి చూడండి. దీని వ‌ల్ల క‌ళ్ల వెనుక ఉండే కండ‌రాలు ఫ్లెక్సిబుల్ అవుతాయి. కంటి చూపు (eye sight) మెరుగ‌వుతుంది.

*ప‌లుమార్లు పైకి కింద‌కి చూస్తూ ఉండండి. క‌ళ్లు (eyes) కాస్త రిలాక్స్ అవుతాయి.

*ఫోక‌స్ స్విచింగ్ మెథ‌డ్ కూడా బాగా ప‌నిచేస్తుంది. మీ చెయ్యి చాచి బొట‌న వేలుని తెర‌వండి. ఆ బొట‌న వేలుని కొన్ని నిమిషాల పాటు చూస్తూ ఉండండి. ఇలా చేస్తే విజ‌న్ కోఆర్డినేష‌న్ బాగుంటుంది.