Mosquito: ఈ మొక్కలు ఉంటే దోమలు రావు
Hyderabad: అసలే వర్షాకాలం. రోగాలు ఎక్కువయ్యే కాలం ఇది. ఇక దోమలు (mosquito) తోడైతే డెంగ్యూ, మలేరియా జ్వరాలతో అల్లాడిపోతాం. దోమల నివారణకు ఎన్ని చర్యలు తీసుకున్నా అవి మళ్లీ వస్తూనే ఉంటాయి. అయితే.. కొన్ని రకాల ఇంట్లో పెంచుకునే మొక్కల (plants) వల్ల ఈ దోమల్ని పూర్తిగా నివారించవచ్చట. అవేంటో చూద్దాం.
రోజ్‌మేరీ (rosemary)
రోజ్‌మేరీ మొక్కలు ఇంట్లో ఉంటే దోమలు రావట. దీని నుంచి వెలువడే వాసన వల్ల దోమలే కాదు, కొన్ని రకాల పురుగులు కూడా ఇంట్లోకి రావట.
లెమన్ బామ్ (lemon balm)
ఈ లెమన్ బామ్ మొక్కల నుంచి హార్స్ మింట్ (horse mint) సువాసన వస్తుంటుంది. ఈ సువాసనకు దోమలు చుట్టపక్కల ఉండలేవు. (mosquito)
బంతి పూలు (marigold)
ముద్ద బంతి పూల మొక్కలు ఎక్కడుంటే అక్కడ సువాసనలు వెదజల్లుతుంటాయి. దోమలు, ఈగలు, పురుగులు ఇలా ఎగిరేవి ఏవీ కూడా ఈ మొక్కలు ఉంటే మన ఇంట్లోకి దరిచేరవు.
తులసి (basil)
తులసి మొక్కలు అందరి ఇళ్లల్లోనూ కామన్‌గా ఉండేవే. పూజ చేసే కుండీలోని మొక్క కాకుండా రెండు మూడు కుండీల్లో ఈ తులసి మొక్కలను పెంచి చూడండి. దీని నుంచి వెలువడే వాసనల వల్ల పీల్చే గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుంది. (mosquito)
లెమన్ గ్రాస్ (lemon grass)
ఈ లెమన్ గ్రాస్ మొక్క గురించి అందరికీ తెలిసిందే. ఈ మొక్కలోని కాడలను కట్ చేసి లెమన్ టీ (lemon tea) చేసుకుని తాగుతుంటారు. ఈ లెమన్ గ్రాస్‌లో ఉండే కొన్ని సుగుణాల వల్ల దోమలు కూడా రావు.