Natural Soaps: ఈ మొక్కల నుంచే తయారుచేస్తారు!
Hyderabad: కొన్ని రకాల మొక్కలను నేచురల్ సోపుల్లా (natural soaps) కూడా వాడుకోవచ్చట. తినే తిండి నుంచి వాడే సోపు వరకు అన్నీ ఆర్గానిక్‌గా ఉండాలని కోరుకునేవారికి ఈ మొక్కలు చాలా ఉపయోగపడతాయి. ఆర్గానిక్ కాస్మెటిక్స్ తయారుచేసే కొన్ని సంస్థలు కూడా సోపులను ఫేస్ వాష్‌లను తయారుచేయడానికి ఈ మొక్కలను వాడతాయట.
సోప్ వోర్ట్ (soapwort)
సోప్ వోర్ట్ అనే మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది మనకు కొత్త కావచ్చు. కానీ కాస్మెటిక్ సంస్థలకు ఇది బాగా తెలిసిన మొక్క. ఎందుకంటే ఈ మొక్కలోఉంటే సాపోనిన్స్ ద్వారానే మనం రుద్దుకునే సోపుల నుంచి నురగ వచ్చేది. ఈ మొక్క నుంచి ఆకులు, వేర్లను తీసి కాస్త నీళ్లలో తడిపి ఒంటికి రుద్దుకున్నా కూడా మంచిదే.
బఫెలోబెర్రీ (buffaloberry)
సోపుల్లోనే కాదు కొన్ని రకాల మెడిసిన్స్‌లో కూడా ఈ బఫెలోబెర్రీ మొక్కను వాడతారు. చూడటానికి చెర్రీ పండు మొక్కలా ఉండే దీనిలో నురగ వచ్చేలా చేసే సాపోనిన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం వాడే చాలా మటుకు సోపులు, షాంపూలను ఈ బఫెలో బెర్రీతోనే తయారుచేస్తారు. (natural soaps)
సోప్‌వీడ్ యుక్కా (soapweed yucca)
ఈ మొక్క వేర్లలో సాపోనిన్స్ ఎక్కువగా ఉంటాయట. మనకు చూడటానికి ఇదొక పిచ్చి మొక్కలా కనిపిస్తుంది కానీ కాస్మెటిక్స్‌లో ఎక్కువగా దీనిని ఉపయోగిస్తుంటారు.
సోప్ ప్లాంట్ (soap plant)
దీని పేరులోనే సోప్ ఉంది. కాలిఫోర్నియా, ఓరెగాన్ ప్రాంతాల్లో ఈ మొక్కలు చాలా విరివిగా పెరుగుతుంటాయి. ఆ ప్రాంతాల్లో నివసించేవారు ఈ సోప్ ప్లాంట్ మొక్కలను కోసి డైరెక్ట్‌గా వాడుకుంటారు. (natural soaps)