Health: వీటిని ఫ్రిడ్జ్‌లో అస్సలు పెట్టకండి
Hyderabad: కొన్ని రకాల ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్‌లో (fridge) అస్సలు పెట్టకూడదని చెప్తున్నారు ఆహార నిపుణులు. అసలు ఏ రకమైన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదో చూద్దాం. (health)
టమాటాలు (tomatoes)
ఫ్రిడ్జ్‌లో టమాటాలను అస్సలు పెట్టకూడదట. వాటిలో ఉండే ఫ్లేవర్ పోయి మరీ మెత్తపడిపోతాయి.
వెల్లుల్లి (garlic)
వెల్లుల్లిని కూడా చల్లని ప్రదేశాల్లో ఉంచకూడదు. ఫ్రిడ్జ్‌లో పెడితే మొలకలు వచ్చి రబ్బర్లా మారిపోతుంది. (health)
అరటి పండ్లు (bananas)
అరటి పండ్లు ఎప్పుడూ బయటే ఉంచాలి. ఫ్రిడ్జ్‌లో పెడితే బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి.
ఉల్లిపాయలు (onions)
ఉల్లిపాయలు ఫ్రిడ్జ్‌లో పెడితే త్వరగా పాడైపోతాయి. అయితే ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే.. మీరు ఉల్లిపాయలు తరగాలి అనుకుంటే కళ్లు మండిపోతాయి కాబట్టి వాటిని కట్ చేయడానికి ఒక గంట ముందు తొక్క తీసి ఫ్రిడ్జ్‌లో కానీ చల్లని నీళ్లల్లో కానీ పెట్టి చూడండి. అప్పుడు కళ్లు మండవు.
తేనె (honey)
తేనెను ఫ్రిడ్జ్‌లో పెడితే వచ్చే నష్టమేమీ లేదు కానీ.. త్వరగా క్రిస్టలైజ్ అయిపోతుంది. అప్పుడు వాడుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. (health)
ఆలుగడ్డ (potatoes)
ఆలుగడ్డలను ఫ్రిడ్జ్‌లో పెడితే దానిలో ఉండే స్టార్చ్ చెక్కరలోకి మారిపోతుంది. దాంతో వండుకుని తిన్నా కూడా రుచి ఉండవు.
కాఫీ (coffee)
కాఫీ పొడిని ఫ్రిడ్జ్‌లో పెట్టే అలవాటు ఉంటే వెంటనే తీసేయండి. ఫ్రిడ్జ్‌లో ఉండే ఇతర పదార్ధాలను కాఫీ పీల్చేసుకుంటుంది. కావాలంటే ఒక కంటైనర్‌లో ఉంచి ఏదైనా చీకటి ప్రదేశాల్లో పెట్టుకోవచ్చు.