Diabetes: షుగర్ పేషెంట్స్‌కు ఇవి విషంతో సమానం
Diabetes: షుగర్ పేషెంట్స్ ఏం తినాలన్నా ఆచి తూచి తింటుండాలి. సాధారణ వ్యక్తుల్లా వారు అన్నీ తినలేరు. అయితే కొన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. అవి మనకు ఎంతో ఆరోగ్యకరమైనవి. కానీ షుగర్ పేషెంట్లకు మాత్రం అవి విషంతో సమానమని నిపుణులు చెప్తున్నారు.
డ్రై ఫ్రూట్స్, నట్స్
డ్రై ఫ్రూట్స్, నట్స్ ఎంతో ఆరోగ్యకరమైనవి. రోజూ గుప్పెడు తింటూ ఉండాలి అంటుంటారు. కానీ మధుమేహులకు మాత్రం ఇవి అస్సలు మంచివి కావట. ఎందుకంటే అందులో సహజంగానే ఎక్కువ మోతాదులో చెక్కర ఉంటుంది. మధుమేహులు ఇవి తినడం వల్ల బ్లడ్ షుగర్ ఉన్నట్టుండి పెరిగిపోతుంది.
ఎలాంటి డ్రై ఫ్రూట్స్‌కి దూరంగా ఉండాలి?
కిష్మిస్ – అత్యధిక మోతాదులో చెక్కర ఉంటుంది. కొద్దిగా తిన్నా డేంజరే
ఖర్జూరం – అత్యధిక మోతాదులో షుగర్ ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
అత్తి పండ్లు – ఇందులో షుగర్‌తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా అధికమే. ఒకటి రెండు ఓకే. ఎక్కువగా తింటే ప్రమాదమే.
పిస్తా పప్పు – ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు ఎంత ఉంటుందో అంతే స్థాయిలో నేచురల్ షుగర్ కూడా ఉంటుంది. రెండు మూడు పలుకులు తింటే చాలు
జీడిపప్పు – కేలొరీలు, కార్బోహైడ్రేట్లు మరీ ఎక్కువగా ఉంటాయి.