Bedroom Plants: వీటితో మంచి నిద్రపడుతుందట..!
Hyderabad: హాయిగా నిద్రపోవడానికి నిద్రపడితే చాలు కదా.. ఈ మొక్కలు ఎందుకు అనుకుంటున్నారా? (bedroom plants) అది కరెక్టే కానీ కొన్ని రకాల మొక్కలను బెడ్‌రూంలో పెట్టుకుంటే ఇంకా మంచిదట. ఆ మొక్కల వల్ల ఏదో తెలీని హాయినిచ్చే ఫీలింగ్ మనల్ని నెమ్మదిగా నిద్రలోకి జారుకునేలా చేస్తాయి. ఇంతకీ ఏంటా మొక్కలు..?
మల్లె మొక్క (jasmine plant)
మల్లె పూల వాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పూలు కోసి అల్లి తలలో పెట్టుకుంటే వచ్చే వాసన కంటే.. మొక్కకే ఆ పూలు ఉండి ఆ మొక్కను బెడ్‌రూంలో పెట్టుకుంటే ఆ వచ్చే వాసన ఎంతో హాయిగా ఉంటుందట. దాని వల్ల హాయిగా నిద్రపడుతుందని అంటున్నారు కొందరు నిపుణులు.
స్నేక్ ప్లాంట్ (snake plant)
పేరు వినగానే అమ్మో అని భయపడిపోకండి. స్నేక్ ప్లాంట్ అంటే పాముల మొక్క అని కాదు. ఆ మొక్క ఆకారం పాములా ఉంటుందని ఆ పేరు వచ్చింది. దీని నుంచి ఆక్సిజెన్ రిలీజ్ అవుతుంది కాబట్టి నిద్ర బాగా పట్టే అవకాశం ఉందట. (bedroom plants)
లావెండర్ (lavender)
పేరు చదవగానే పరిమణం గుర్తుకొచ్చింది కదూ..! లావెండర్‌లో ఉండే మ్యాజికే అది. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆ లావెండర్ వాసన చూస్తే ఎంతో హాయిగా ఉంటుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. బెడ్ నుంచి దిగబుద్ధి కాదు.
పీస్ లిల్లీ (peace lilly)
లిల్లీ పూల మొక్క నిద్రపట్టడానికే కాదు ఎయిర్ ప్యూరిఫైయర్‌గానూ పనిచేస్తుంది. ఊపిరితిత్తుల సమస్యలు కూడా రావట దీని వల్ల. కాకపోతే కాస్త వెలుతురు తగిలే ప్లేస్‌లో దీనిని పెట్టుకోండి. (bedroom plants)