Sugar: చెక్క‌ర‌కు ప్ర‌త్యామ్నాయంగా ఇవి వాడితే స‌రి

Sugar: చెక్క‌ర అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. అది వైట్ షుగ‌ర్ అయినా బ్రౌన్ షుగ‌ర్ అయినా ఫిట్‌నెస్ పాటించాల‌నుకునేవారు ఈ చెక్క‌ర‌కు దూరంగా ఉంటారు. మ‌రి చెక్క‌ర లేకుండా తీపి ఎలా వ‌స్తుంది? చెక్క‌ర‌కు ప్ర‌త్యామ్నాయంగా ఏవి వాడితే మంచిదో తెలుసుకుందాం.

బెల్లం (jaggery)

చెక్క‌ర కంటే బెల్లం వంద రెట్లు మంచిది అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇది స‌హ‌జమైన స్వీటెన‌ర్ కూడా. బెల్లంలో ఐర‌న్ కూడా పుష్క‌లంగా ఉంటుంది. కాక‌పోతే బెల్లం కొనుగోలు చేసేట‌ప్పుడు కూడా చూసి తీసుకోవ‌డం బెట‌ర్.

ఖ‌ర్జూరాలు (Dates)

పాత కాలంలో కూడా చెక్క‌ర‌కు బ‌దులు ఖ‌ర్జూరాలు వాడేవార‌ట‌. అయితే తీపి ప‌దార్థాలు అన్నింటిలో ఖ‌ర్జూరాలు నేరుగా వేయ‌లేం కాబ‌ట్టి ఎండు ఖ‌ర్జూరాల పొడి తెచ్చుకుని వాడుకోవ‌డం ఉత్త‌మం.

కొబ్బ‌రి, తాటిబెల్లంతో త‌యారుచేసిన చెక్క‌ర‌ (coconut, palm sugar)

ఇది తెల్ల చెక్క‌ర మాదిరికాదు. కొబ్బ‌రి, తాటిబెల్లంతో చేసిన చెక్క‌ర‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా త‌క్కువే.

అడ‌వి తేనె (forest honey)

తేనెను ర‌క‌ర‌కాల పేర్ల‌తో మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. ఈ రోజుల్లో స్వ‌చ్ఛ‌మైన అడ‌వి తేనె ల‌భించ‌డం కాస్త క‌ష్ట‌మే. కొన్ని ఆర్గానిక్ షాపులు స్వ‌చ్ఛ‌మైన తేనెను అమ్ముతుంటారు. కాక‌పోతే కొంచెం ధ‌ర ఎక్కువ‌గా ఉంటుంది.