summer heat: వడదెబ్బకు కారణం.. లక్షణాలు ఇవే.. జాగ్రత్త!
Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో(telugu states) ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు భగభగ మండిపోతున్నాడు. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రత(temperatures are high)లు నమోదువుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా ఎండ తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ(india meteorological department) హెచ్చరిస్తోంది. మరోవైపు వేడుగాలులు, ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని వైద్యులు(docters) అంటున్నారు. ఎక్కువ సమయం ఏసీ గదుల్లో గడిపి ఒక్కసారిగా ఎండలోకి రావడం.. లేదంటే 40 డిగ్రీల మండే ఎండలో తిరిగి ఒకేసారి 18 డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ఏసీ గదుల్లోకి వెళ్లవద్దని చెబుతున్నారు. మరి కొందరు తీవ్రమైన ఎండ నుంచి వచ్చిన వెంటనే స్నానం చేస్తుంటారు.
ఇలా చేయడం సరికాదని.. శరీరంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గుల వల్ల అది వడదెబ్బ(heat stroke)కు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఎండ నుంచి వచ్చిన తర్వాత కొంతసేపు గది వాతావరణంలో గడపాలని.. అప్పుడే ఏసీ గది లేదంటే స్నానానికి వెళ్లాలని చెబుతున్నారు. నీరు(watter) కూడ అధికంగా తీసుకోవాలని.. లేదంటే వడదెబ్బ తగులుతుందని చెబుతున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే నీడ లేదా చల్లని ప్రదేశానికి రోగిని తరలించాలి. చల్లని నీటితో స్పాంజ్, ఐస్ ప్యాక్‌లు లేదా నుదురు, మెడ, శరీరాన్ని తడి టవల్లో తుడిచి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. ఎండలు ఎక్కువగా ఉన్నందు వల్ల ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 3 గంటలలోపు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఉప్పు కలిపిన నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణాలు, ఎక్కువ నీటి శాతం ఉండే పండ్లను తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.