Garlic: రోజూ ప‌చ్చి వెల్లుల్లి తింటున్నారా?

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. కొంద‌రు వంటల్లో వేసుకుని తింటుంటారు. మ‌రి కొంద‌రు ఉద‌యాన్నే ప‌చ్చిగానే తినేస్తుంటారు. అస‌లు రోజూ వెల్లుల్లి ప‌చ్చిగా తింటే మంచిదా కాదా..? (garlic)

*ఉద‌యాన్నే ఒక‌టి లేదా రెండు వెల్లుల్లి రెబ్బ‌లు న‌మిలితే ప‌ర్వాలేదు కానీ అంత‌కంటే ఎక్కువ తిన్నారంటే మాత్రం మోష్స్ అవ్వ‌డం, క‌డుపు ఉబ్బిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

*వెల్లుల్లిని వ‌లిచాక శుభ్రంగా చేతులు క‌డుక్కోవాలి. లేదంటే మీరు పొర‌పాటున ఆ చేతులు మీ శ‌రీరంపై ఎక్క‌డ తాకినా ద‌ద్దుర్లు వ‌చ్చేస్తాయి. అవి ఒక పట్టాన‌పోవు.

*మీకు ఆల్రెడీ మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు కానీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ స‌మ‌స్య‌లు కానీ ఉంటే వెల్లుల్లి జోలికి పోక‌పోవ‌డం మంచిది. వెల్లుల్లి ఆ స‌మ‌స్య‌ను మ‌రింత తీవ్రం చేస్తుంది. (garlic)

*మీకు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ సమ‌స్య‌లు ఉన్నా కూడా వెల్లుల్లిని తిన‌కూడ‌దు.

*వెల్లుల్లి నేచుర‌ల్ బ్లడ్ థిన్న‌ర్‌గా ప‌నిచేస్తుంది. అంటే ర‌క్తం ప‌ల్చ‌బ‌డేలా చేస్తుంది. కానీ ఎక్కువ‌గా తింటే మాత్రం బ్లీడింగ్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

*ఒక‌వేళ మీరు ఆల్రెడీ బ్లడ్ థిన్న‌ర్స్, యాంటీ కాగ్యులెంట్స్ వంటి మెడికేష‌న్ తీసుకుంటున్న‌ట్లైతే వెల్లుల్లి తిన‌కండి.  మందులు వేసుకున్నా కూడా ప‌నిచేయ‌కుండాపోతాయ్. (garlic)