Coffee: వర్షాకాలం అని అతిగా తాగేస్తున్నారా?
Hyderabad: అసలే వర్షాకాలం. తరచూ వేడి వేడి కాఫీలు, టీలు తాగాలని అనిపిస్తూ ఉంటుంది (coffee). అలాగని కాఫీ అతిగా తాగేస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.
*కాఫీ తాగగానే మనలో అడ్రినలైన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అందుకే తాగిన వెంటనే చురుగ్గా ఉంటాం. కానీ అదే అడ్రినలైన్ హార్మోన్ ఒక రకమైన టెన్షన్‌ను కలిగిస్తుంది. దాంతో కాళ్లు వణుకుతూ ఉంటాయి. కావాలంటే ఎప్పుడైనా అబ్సర్వ్ చేసి చూడండి. (coffee)
*కాఫీ ఎక్కువగా తాగితే రాబ్డోమయోలిసిస్ (rhabdomyolisys) వస్తుంది. ఇది కండరాలకు సంబంధించిన సమస్య. కిడ్నీలు (kidneys) కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.
*అతిగా కాఫీ తాగితే బ్లడ్ ప్రషర్ (blood pressure) పెరిగిపోతుంది. హార్ట్, బ్రెయిన్‌కి రక్త సరఫరా ఆగిపోయి స్ట్రోక్, పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట.
*మనిషికి నిద్ర (sleep) అనేది ఎంతో అవసరం. ఒకపూట తిండి లేకపోయినా తట్టుకుంటాం కానీ నిద్ర లేకపోతే పిచ్చి పట్టినట్లుగా ఉంటుంది. అసలే మనకున్న టెన్షన్లతో రాత్రిళ్లు నిద్రపట్టదు. అందులో కాఫీలు ఎక్కువగా తాగేస్తే ఇన్‌సోమ్నియా (insomnia) వచ్చేస్తుంది. దాంతో నిద్ర పట్టక లేని పోని రోగాలు వస్తాయి. (coffee)
*గుండె దడ (palpitations) పెరిగే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఫలితంగా ఆట్రియల్ ఫైబ్రిలేషన్ (atrial fibrillation) వస్తుంది. అంటే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తుంటాయి. గుండె సమస్యలు మొదలవ్వడానికి ప్రధాన కారణం ఇదే.