నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్నారా.. ఈ రిస్క్‌ల గురించి తెలుసుకోవాల్సిందే
Night Shift: ఇండియాలో నైట్ షిఫ్ట్ ఉద్యోగాల వంత ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. మన భారత కాలమానం ప్రకారం ఇక్కడ రాత్రి వేళల్లో శరీరానికి రెస్ట్ ఇవ్వాలి.. పగటి వేళల్లో అలసిపోయేలా పనిచేయాలి. కానీ నైట్ షిఫ్ట్‌లలో పనిచేసేవారికి ఇది రివర్స్‌లో ఉంటుంది. వారు రాత్రంతా పనిచేసి ఉదయం పూట నిద్రపోతారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగని ఉద్యోగాలు మానాలంటే కుదరని పని. కాకపోతే ఆహార విషయాల్లో కొన్ని మార్పులు చేసుకుంటే రిస్క్‌ల నుంచి బయటపడొచ్చు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నైట్ షిఫ్ట్‌ల వల్ల కలిగే రిస్క్‌లు
గుండె సంబంధిత వ్యాధులు, విపరీతమైన నీరసం, ఊబకాయం, డయాబెటిస్ సమస్యలు వచ్చే అవకాశం ఉందట. నీరసంగా ఉంటుంది కాబట్టి తెలీకుండానే దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారట. (night shift)
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఉదయం వేళల్లో ఎంత నిద్రపోయినా రాత్రి వర్క్ సమయానికి అలసిపోతుంటారు. అందుకే ఉదయం వేళల్లో పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. నైట్ షిఫ్ట్‌లు చేసేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఫలితాంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు మాత్రమే తినాలి. అలా కాకుండా ఆఫీస్‌లో ఏదో ఒకటి తినేద్దాంలే అనుకుంటే మాత్రం ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టుకుంటున్నట్ల.
ఏం చేయాలి ఏం చేయకూడదు?
*మీరు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, పీచు పదార్థాలు కచ్చితంగా ఉండి తీరాలి.
*ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండండి. సాధారణంగా రాత్రివేళల్లో నిద్రకు ఉపక్రమిస్తారు కాబట్టి శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకే రాత్రి వేళల్లో నీళ్లు తాగుతూ ఉండండి. (night shift)
*ఒకేసారి ఎక్కువగా తినేయకుండా విభజించుకుని తినండి. అప్పుడే కడుపు ఉబ్బరంగా భారీగా అనిపించదు.
*మీరు స్నాక్స్ తినాలనుకుంటే వాటి బదులు పండ్లు, నట్స్ అందుబాటులో ఉంచుకోండి.
*రాత్రి నిద్రొస్తే కాఫీలు టీలు తాగేస్తుంటారు. మరీ తప్పదు అనుకుంటే ఫర్వాలేదు కానీ రోజూ అలవాటు చేసుకోకండి. ముఖ్యంగా మీ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్లే సమయంలో మాత్రం కాఫీ టీ అస్సలు తాగొద్దు. ఎందుకంటే ఇది మీ నిద్రను పాడుచేస్తుంది. (night shift)
*ఆరోగ్యకరమైన ఫుడ్‌ని ఎలా ఎంచుకోవాలి అనే సందేహాలు మీకుంటే ఒకసారి వైద్యులను సంప్రదించండి. మీకు అన్ని వైద్య పరీక్షలు చేసి వారే పోషకాహార డైట్‌ను సూచిస్తారు. వైద్యుల సలహాలు పాటించి డైట్ ఫాలో అయితే మీరు ఏ షిఫ్ట్‌లో పనిచేసినా ఆరోగ్యం సహకరిస్తుంది.