Health: రాత్రివేళల్లో చదవడం మంచిదేనా?
కొందరికి తెల్లవారుజామున లేచి చదువుకుంటూ ఉంటారు (health). మరి కొందరికి రాత్రి సమయాల్లో చదవడం అలవాటు. అసలు రాత్రి వేళ్లలో చదుకోవచ్చా? రాత్రి సమయాల్లో చదివితే బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుందా? అసలు రాత్రి వేళల్లో చదువుకోవడం మంచిదా కాదా..?
*రాత్రి వేళల్లో కాస్త ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి అవరోధాలు లేకుండా చదువుకోవచ్చు. కాబట్టి మన బ్రెయిన్ ఫోకస్డ్గా ఉంటుంది. చదివింది కూడా బుర్రకెక్కుతుంది.
*కొందరికి రాత్రి వేళల్లో చదివితే బ్రెయిన్ యాక్టివేట్ అయినట్లు ఉంటుంది. అప్పుడు వారు సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు.
*అయితే.. రాత్రి వేళల్లో చదువుకోవాలంటే మరి నిద్రకు భంగం కలిగినట్లే. సరైన నిద్ర లేకపోతే చదివింది కూడా మర్చిపోతుంటారు. ఉదయాన్నే ఏదైనా పరీక్ష ఉన్నా కూడా నిద్రమత్తులో ఏం రాస్తున్నారో కూడా తెలీదు.
*మీరు ఒక సమయానికి పడుకోవడం అలవాటు చేసుకుంటే.. అదే సమయానికి కచ్చితంగా పడుకుని తీరాలి. మీరు పడుకోకుండా చదువుకోవాలి అనుకున్నా కూడా నిద్ర వచ్చేస్తుంది. దీనినే సర్కాడియన్ రిథమ్ అంటారు. అంటే మనం రోజూ సమయానికి చేసే పనులు అంటే తిండి, నిద్ర వంటివి అదే సమయానికి రిపీట్ అవుతుండాలి. మధ్యలో బ్రేక్ వస్తే అది మైగ్రేన్‌కు దారితీస్తుంది.
*ఒకవేళ మీరు ఈ ప్రక్రియను బ్రేక్ చేసి రాత్రి వేళల్లోనే చదువుకోవాలని అనుకుంటే మాత్రం.. మీరు నిద్రపోయే టైమింగ్స్‌ని మార్చుకుని ఒక వారం పాటు దానినే ఫాలో అవ్వండి. అప్పుడు మీ శరీరం కూడా ఆ ప్రక్రియకు అలవాటు పడుతుంది.