Hair Fall: జుట్టు రాల‌కుండా శాశ్వ‌త ప‌రిష్కారం..!

Hair Fall: జుట్టును రాలిపోకుండా ఆప‌డం అంత సులువు కాదు. చాలా ప్రొడ‌క్ట్స్ వాడుతుంటాం కానీ కంట్రోల్ అవ్వ‌దు. జుట్టు రాల‌డం కంటే కేవ‌లం అప్పుడప్పుడూ పాటించే చిట్కాలు కాదు. క్ర‌మం త‌ప్ప‌కుండా పాటించే ఓ ప్లాన్ కావాలి. ఆ ప్లాన్ ఆయుర్వేదంలో ఉంది.

జుట్టు రాల‌కుండా ఆపేందుకు మొదటిగా ఉద‌యాన్నే క‌రివేపాకు తినాలి. ఇందులో బీటా కెరోటిన్, అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్ల‌ను గ‌ట్టిప‌డేలా చేసి జుట్టు రాల‌డాన్ని కంట్రోల్ చేస్తాయి. మూడు నుంచి ఐదు క‌రివేపాకులు తింటే చాలు. కాక‌పోతే ఆ క‌రివేపాకు ర‌సం అంతా వ‌చ్చేలా న‌మ‌లాలి. క‌రివేపాకుల నుంచి మొత్తం ర‌సం బ‌య‌టికి రావాలంటే దాదాపు ఐదు నిమిషాల పాటు న‌మ‌లాలి. అలాగ‌ని గ‌బ‌గ‌బా న‌మ‌ల‌కూడ‌దు. నిదానంగా న‌ములుతూ దాని ర‌సాన్ని తాగాలి. ఇలా ఒక నెల రోజుల పాటు చేసి చూడండి. ఫ‌లితాలు మీకే క‌నిపిస్తాయి. (Hair Fall)

ఇక రెండో చిట్కా ఏంటంటే.. ఉద‌యం లేవ‌గానే రాగి పాత్ర‌లో రాత్రంతా ఉంచిన నీటిని తాగాలి. ఇలా రాగి పాత్ర‌లోని నీరు తాగితే జుట్టుకి ఎంతో మంచిది. ఆయుర్వేద గ్రంథాల‌లో దీని గురించి బాగా వ‌ర్ణించారు. చివ‌రికి మోడ్ర‌న్ సైన్స్ కూడా దీనిని ధృవీక‌రించింది. శ‌రీరంలో కాప‌ర్ లోపాన్ని త‌గ్గించేందుకు ఇలా కాప‌ర్ చార్జ్‌డ్ నీళ్లు తాగాలి. ఉద‌యం లేవ‌గానే నీళ్లు కాకుండా టీ, కాఫీలు తాగుతారో వారిలో జుట్టు రాలే స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉంటాయి. సింపుల్‌గా లేవ‌గానే నీళ్లు తాగి ఫ్రెష్ అవ్వండి. ఆ త‌ర్వాత క‌రివేపాకులు తినండి. క‌రివేపాకులు తిన్నాక ఒక 30 నిమిషాల వ‌ర‌కు నీళ్లు తాగ‌డం, బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డం వంటివి చేయ‌కూడ‌దు. అప్పుడే క‌రివేపాకు బాగా ప‌నిచేస్తుంది.

ఇక జుట్టును మ‌జ్జిగ‌తో క‌డుక్కుంటే క‌లిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఇది ఇప్పుడు వ‌చ్చిన ట్రెండ్ కాదు. పాత రోజుల్లో కూడా పాటించేవారు. ఎందుకంటే మ‌జ్జిగ జుట్టుకు క్లెన్స‌ర్‌లా ప‌నిచేస్తుంది. జుట్టుకు కావాల్సిన ప్రొటీన్‌ను ఇస్తుంది. కురుల‌ను బ‌లంగా మారుస్తుంది. ఉప్పు క‌ల‌ప‌ని మ‌జ్జిగ‌ను కాస్త తీసుకుని కుదుళ్ల‌కు మ‌సాజ్ చేసుకోండి. ఒక 20 నిమిషాల త‌ర్వాత త‌ల‌స్నానం చేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేసినా చాలు.