White Teeth: 5 నిమిషాల్లో.. తెల్ల‌టి ప‌ళ్లు మీ సొంతం!

White Teeth: తెల్ల‌టి ముత్యాల్లాంటి ప‌ళ్లు కావాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి. ఎంత మంచి అంద‌మైన ముఖం ఉన్నా ప‌ళ్లు ప‌సుపు రంగులో ఉంటే ఎంతో ఎబ్బెట్టుగా ఉంటుంది. మ‌రి ఈ ప‌సుపు ప‌ళ్ల‌ను దూరం చేసుకునేందుకు ఏం చేయాలి? దీనికి ఇంట్లోనే ఓ మంచి చిట్కా ఉంది. అదేంటో తెలుసుకుందాం.

మీ పళ్లు తెల్ల‌గా మారాలంటే ఈ సింపుల్ ప‌ద్ధ‌తి చాలు. ముత్యాల్లా మెరిసిపోతాయి. ఎప్పుడు ట్రై చేసినా ఇది ఒక మంత్రంలా పని చేస్తుంది. అన్నింటి క‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. ఈ ప‌ద్ధ‌తి ఎంత సులువుగా ఉంటుందంటే.. ఎంతటి బ‌ద్ధ‌క‌స్తులైనా స‌రే సులువుగా చేసేస్తారు. ఇది 100 శాతం నేచుర‌ల్‌గా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండ‌వు. ఈ పద్ధ‌తి కోసం మీకు కావాల్సింది కేవ‌లం ఒకే ఒక్క ప‌దార్థం. అదేంటంటే.. స్ట్రాబెర్రీ (Strawberry). మీరు చ‌దివింది నిజ‌మే. మీ పళ్లు నిగ‌నిగ‌లాడాలంటే స్ట్రాబెర్రీ చాలు. ఇంత‌కీ ఈ స్ట్రాబెర్రీతో ఏం చేయాలంటే.. ఉద‌యాన్నే మీరు బ్ర‌ష్ చేసుకునేట‌ప్పుడు ఒక స్ట్రాబెర్రీని మెత్త‌గా పేస్ట్‌లా చేసుకోండి. ఆ పేస్ట్‌ను మీరు బ్ర‌ష్ చేసుకునే పేస్ట్‌పై కాస్త అప్లై చేసి బ్ర‌ష్ చేసుకోండి. (White Teeth)

ఇక్క‌డ మీరు గుర్తుంచుకోవాల్సిన మ‌రో అంశం ఏంటంటే..స్ట్రాబెర్రీ పేస్ట్‌తో బ్ర‌ష్ చేసుకునేట‌ప్పుడు ప్ర‌తి పంటికి బ్ర‌ష్ త‌గలాలి. ఇలా అయితేనే అన్ని ప‌ళ్లు క్లీన్ అవుతాయి. ఈ ప‌ద్ధ‌తిని ఒక్క‌సారి ట్రై చేసి చూడండి. ఐదు రోజుల పాటు పాటిస్తే చాలు. ఫ‌లితాలు చూసి మీరే షాక‌వుతారు. మీ ప‌ళ్లు తెల్ల‌గా మారిపోయిన త‌ర్వాత కూడా కంటిన్యూ చేయ‌చ్చు. స్ట్రాబెర్రీలో మ్యాలిక్ యాసిడ్ (Malic Acid) ఉంటుంది. ఈ మ్యాలిక్ యాసిడ్ ప‌ళ్ల‌ను తెల్ల‌గా మారుస్తుంది. ప‌ళ్లను తెల్ల‌గా మార్చుకునేందుకు దంత వైద్యుల వ‌ద్ద‌కు వెళ్లినా కూడా వాళ్లు మ్యాలిక్ యాసిడ్‌తోనే ట్రీట్మెంట్ చేస్తారు. ఈ ప‌ద్ధ‌తిలో బ్ర‌ష్ చేసుకోవ‌డం మీకు కుద‌ర‌క‌పోతే.. చ‌క్క‌గా వారానికి రెండు మూడు రోజుల పాటు స్ట్రాబెర్రీ పండ్ల‌ను తినేయండి. ఇలా చేసినా కూడా ప‌ళ్లలోని ప‌సుపుద‌నం పోతుంది. కావాలంటే మీరు వారానికి స‌రిప‌డా స్ట్రాబెర్రీ టూత్ పేస్ట్‌ను ముందే త‌యారుచేసి ఫ్రిజ్‌లో పెట్టుకుని వాడుకోవ‌చ్చు.

ఇక్క‌డ మ‌రో ముఖ్య‌మైన విష‌యం గుర్తుంచుకోండి. ఈరోజుల్లో మార్కెట్‌లో చాలా ర‌కాల టూత్ పేస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. వైటెనింగ్ టూత్‌పేస్ట్‌ల‌ని ఏవేవో పేర్ల‌తో అమ్మేస్తున్నారు. వీటికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కావాలంటే టూత్ పేస్ట్ వ‌ర‌కు ఏది వాడితే మంచిదో దంత వైద్యుల‌ను అడిగి తెలుసుకోండి. కానీ ప‌ళ్లు తెల్ల‌బ‌డేందుకు మాత్రం ఆర్టిఫిషియ‌ల్ వైటెనింగ్ టూత్‌పేస్ట్‌ల‌ను మాత్రం అస్స‌లు వాడ‌కూడ‌దు. ఎందుకంటే ఇందులో పేస్ట్ త‌యారు చేయ‌డానికి వాడే కెమిక‌ల్స్ చాలా ప్ర‌మాద‌క‌రం. ఇవి ప‌ళ్ల‌ను తెల్ల‌గా మార్చ‌డం ప‌క్క‌న పెడితే ఎనేమెల్ పోగొట్టి ప‌ళ్లు పుచ్చిపోయేలా లేదా నోటి అల్స‌ర్లు వ‌చ్చేలా చేస్తాయి.