Body Heat: న్యాచురల్‌గా ఒంట్లో వేడి తగ్గాలంటే..
ఒంట్లో వేడి (body heat) ఎక్కువైపోతే ముక్కులో నుంచి రక్తం కారడం వంటివి సంభవిస్తుంటాయి. పింపుల్స్ ఎక్కువ అయిపోతాయి. బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఆ వేడిని కొన్ని రకాల పండ్లు, కూరగాయలతో నేచురల్‌గా తగ్గించుకోవచ్చు.
కొబ్బరి నీళ్లు (coconut water)
బాడీ హీట్ కోసమనే కాదు.. ఏ కాలంలోనైనా కొబ్బరి నీళ్లు ఒంటికి మంచివే. పొటాషియం ఎక్కువగా ఉండే నేచురల్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ ఇది. ఒంట్లో వేడిని సులువుగా తగ్గించేస్తుంది.
పుదీనా (pudina)
పుదీనా చట్నీని వారంలో మూడు, నాలుగు సార్లు తింటూ ఉండాలి. లేదంటే.. ఏదైనా డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటే అందులో పుదీనా ఆకులు వేసుకోండి. పుదీనాలో కూలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. (body heat)
పుచ్చకాయ (watermelon)
పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీని చల్లగా ఉంచి హైడ్రేట్ చేస్తాయి.
పెరుగు (curd)
పెరుగు కడుపును చల్లగా ఉంచుతుంది. త్వరగా డైజెక్ట్ అయిపోయేలా చేస్తుంది. కూలింగ్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువే. కాకపోతే లస్సీలా ప్రిపేర్ చేసుకుని తాగితే ఇంకా మంచిది.
అరటిపండ్లు (bananas)
ఉదయాన్నే రెండు అరటిపండ్లు తింటే ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. ఇది ఒంట్లోని టిష్యూలను ష్రింక్ అయ్యేలా చేస్తుంది. దాని వల్ల వాటర్ అబ్సార్ప్‌షన్ బాగుంటుంది. ఫైనల్లీ బాడీ కూల్ అయిపోతుంది. (body heat)
అవొకాడో (avocado)
ఈ పండు కాస్త ఖరీదైనది. కాబట్టి కుదిరినప్పుడు తింటూ ఉండండి. ఇది ఒంట్లోని టాక్సిన్స్‌ని తొలగించడంతో పాటు ఒంట్లో వేడిని కూడా తగ్గించేస్తుంది.
కీరా (cucumber)
ఒంట్లో వేడిని తగ్గించడంలో కీరా మొదటి స్థానంలో ఉంటుంది. 90% నీరే ఉంటుంది కాబట్టి రోజూ ఒక కీరా తిని చూడండి. క్రమంగా ఫలితం మీకే తెలుస్తుంది.