Medical Test చేయించుకుంటున్నారా.. జాగ్ర‌త్త‌!

ఒంట్లో బాలేక‌పోతే డాక్ట‌ర్లు వివిధ టెస్ట్‌లు (medical test) చేయించుకుని ర‌మ్మంటారు. ఆ టెస్ట్‌ల కోసం ఒక‌ప్పుడు ద‌గ్గ‌ర్లోని డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌కు వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు ఇంటికే వ‌చ్చి టెస్ట్‌లు చేస్తున్నారు. ఇలా చాలా ర‌కాల హోం టెస్టింగ్ ల్యాబ్ సెంట‌ర్లు వ‌చ్చేసాయి. అయితే ఈ ల్యాబ్ టెస్టుల కార‌ణంగా స్కాంలు కూడా ఎక్కువైపోయాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవ‌ల ఓ 29 ఏళ్ల అమ్మాయి థైరాయిడ్‌, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌ల కోస‌మ‌ని ఓ ప్ర‌ముఖ ల్యాబ్ టెస్టింగ్ యాప్‌లో టెస్ట్‌లు బుక్ చేసుకుంది. బుక్ చేసుకున్న మ‌రుస‌టి రోజే ఓ టెక్నీషియ‌న్ వ‌చ్చి బ్ల‌డ్ సాంపుల్స్ తీసుకుని డ‌బ్బు క‌ట్టించుకుని వెళ్లాడు. అదే రోజున రిపోర్ట్స్ కూడా వ‌చ్చేసాయి. రిపోర్ట్‌లో థైరాయిడ్ ఉన్న‌ట్లు.. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలిసింది. దాంతో ఆ అమ్మాయి వెంటనే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించింది. డాక్ట‌ర్ ఆ రిపోర్టుల‌న్నీ ప‌రిశీలించి.. థైరాయిడ్ ఉండాల్సిన దానికంటే కేవ‌లం ఒక్క పాయింటే పెరిగింది కాబ‌ట్టి ఇంకోసారి టెస్ట్ చేయిద్దాం అని చెప్పారు. అదే హాస్పిట‌ల్‌లో మ‌రోసారి టెస్ట్‌లు చేసారు. ఈసారి రిపోర్ట్‌ల‌లో థైరాయిడ్ లేద‌ని వ‌చ్చింది. లిపిడ్ ప్రొఫైల్ కూడా బాగానే వ‌చ్చింది.  (medical test)

అది చూసి ఆ అమ్మాయి షాకైంది. అదేంటి డాక్ట‌ర్.. నేను చేయించుకున్నప్పుడు రిపోర్ట్‌లో వేరేలా వచ్చింది అని అడిగింది. ఇందుకు ఆ డాక్ట‌ర్ ఒక షాకింగ్ విష‌యం చెప్పారు. ఈ మ‌ధ్య‌కాలంలో ఇలా ఇంటికి వ‌చ్చి ల్యాబ్ టెస్ట్‌లు చేసేవారు.. అన్ రిజిస్ట‌ర్డ్ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్లు న‌డిపేవారు ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్స్‌తో ఓ డీల్ కుదుర్చుకుంటార‌ట‌. ఆ డీల్ ఏంటంటే.. టెస్ట్‌ల‌లో ఏదైనా పాజిటివ్ అని తేలితే.. పేషెంట్ల‌ను ఫ‌లానా హాస్పిట‌ల్స్‌కు వెళ్లండి.. ఫ‌లానా డాక్ట‌ర్‌ను క‌ల‌వండి అని చెప్తుంటార‌ట‌. దాంతో పేషెంట్లు కూడా వారి మాట‌లు న‌మ్మి ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్స్‌కే వెళ్తుంటారు. దీని వ‌ల్ల వారికేంటి ఉప‌యోగం అంటే.. పేషెంట్లు వ‌చ్చి ఫీజులు చెల్లిస్తున్నందుకు హాస్పిట‌ల్స్‌కి.. వారిని తమ వ‌ద్ద‌కు పంపుతున్నందుకు డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌కు ఇంత వాటా అని ఉంటుంది. అలా ఇద్ద‌రూ లాభ‌ప‌డుతున్నారు. (medical test)

అన్ని డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్లు ఇలాగే చేస్తున్నాయ‌ని కాదు.. కొన్ని మాత్ర‌మే ఇలాంటి స్కాంల‌కు పాల్ప‌డుతున్నాయి. కాబ‌ట్టి.. మీరు మెడిక‌ల్ టెస్ట్‌లు చేయించుకోవాలంటే.. మంచి డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌కు వెళ్లి చేయించుకోవ‌డం మంచిది.