పచ్చని గడ్డిపై నడుస్తున్నారా?
వాకింగ్ అందరికీ మంచిదే. సాధారణంగా వాకింగ్ (walking) అంటే వాకింగ్ షూస్ వేసుకుని అలా రోడ్లపైకి లేదా పార్కుల్లో చేస్తుంటారు. ఈ వాకింగ్ అందరికీ తెలిసిందే కానీ గ్రాస్ వాకింగ్ (grass) గురించి తెలుసా? అదేనండీ.. గడ్డిపై నడవడం. గడ్డిపై నడవడం అంటే చెప్పులు, బూట్లు వేసుకుని నడిస్తే కుదరదు. పాదాలు పచ్చని గడ్డికి తాకేలా నడవాలి. ఈ గ్రాస్ వాకింగ్ వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.
*ఒక్కసారి పచ్చని గడ్డిపై మీ పాదాలు పెట్టి చూడండి. ఒంట్లోని నరాలన్నీ ఉత్తేజితం అవుతాయి. పాదాల నుంచి మెదడు వరకు సాంత్వన కలుగుతుంది.
*గడ్డిపై వాకింగ్ చేస్తే మూడ్ బాగుంటుంది.
*శరీరమంతా ఎనర్జిటిక్ అవుతుంది. కావాలంటే ప్రయత్నించి చూడండి.
*ఒత్తిడి తగ్గిస్తుంది. మీరు ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు లేదా ఒత్తిడికి లోనైనప్పుడు కాస్త దగ్గర్లో పార్కులు ఉంటే గడ్డిపై నడిచి చూడండి. ఒత్తిడి తగ్గుతుంది.
*నిద్రలేమితో బాధపడుతుంటే గడ్డిలో ఒక అరగంట నడిచి చూడండి.