Kidney Health: ఇవి తినండి.. మీ కిడ్నీలు మీకు రుణపడి ఉంటాయి
Kidney Health: కిడ్నీల పనితీరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కిడ్నీలు కాస్త మొండికేసినా మెల్లిగా అన్ని అవయవాలపై ప్రభావం చూపడం మొదలుపెడుతుంది. ముఖ్యంగా గుండె. కిడ్నీలకు ఏమన్నా జరిగితే గుండె జబ్బులు వస్తాయి. అదే విధంగా గుండెకు ఏదన్నా జరిగినా కిడ్నీలకు రిస్కే. సో.. కొన్ని రకాల ఆహారాలతో కిడ్నీల పనితీరును ఇలా మెరుగుపరుచుకోండి. ఇవి తినడం వల్ల కిడ్నీలకు సాంత్వన కలుగుతుంది.
కిడ్నీల పనితీరు బాగుండాలంటే మీరు సరైన మోతాదులో నీళ్లు తాగుతూ ఉండాలి. ఆడవారు 8 గ్లాసులు.. మగవారు 13 గ్లాసుల వరకు నీళ్లు తాగితే మంచిది. ఇది ఎలాంటి కిడ్నీ లేదా ఇతర అనారోగ్య సమస్యలు లేనివారికి మాత్రమే. ఏవైనా సమస్యలు ఉంటే ఎన్ని నీళ్లు తాగాలి అనేదానిపై తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
కిడ్నీ, కాలేయానికి కాలిఫ్లవర్ మంచి ఆహారం. ఇందులో అధిక మోతాదులో పీచు, విటమిన్ సి, ఫోలేట్ ఉంటాయి. ఇవి చాలు కిడ్నీల పనితీరు బాగుండటానికి. పైగా కాలిఫ్లవర్‌తో రకరకాల వంటలు కూడా చేసుకునే వీలుంది. (kidney health)
ఎర్ర క్యాప్సికమ్ కూడా ఎంతో మంచిది. ఎందుకంటే ఇందులో పొటాషియం తక్కువగా ఉంటుంది. ఎన్నో పోషక విలువలు ఉన్న ఎర్ర క్యాప్సికమ్‌ని వారంలో ఒకసారైనా తినేందుకు ప్రయత్నించండి.
క్యాబేజ్ కూడా కిడ్నీలకు ఎంతో మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ కిడ్నీ డ్యామేజ్ రిస్క్‌ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి కోలుకునే వీలు కూడా ఉంటుందట.
క్రాన్‌బెర్రీలు, బ్లూబెర్రీలు ఇలా బెర్రీ జాతికి చెందిన అన్ని పండ్లు కూడా కిడ్నీలకు ఎంతో మంచిది. బ్లూబెర్రీలు ఈ మధ్య మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నాయి. ఇవి ఖరీదు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారం లేదా రెండు వారాలకు ఒకసారి తిని చూడండి. (kidney health)