Coconut Oil: ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా?
కొబ్బరి నూనె (coconut oil) ముఖానికి రాస్తున్నారా? అయితే ఇది మీరు చదవాల్సిందే. అసలు కొబ్బరి నూనెను ముఖానికి రాయకూడదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం.
*కొబ్బరినూనెలో ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి కాబట్టి ఇది మార్కెట్లో బ్యూటీ ట్రెండ్ అయిపోయింది.
*అయితే కొబ్బరి నూనెను అసలు ముఖానికి రాయనేకూడదట. ఎందుకంటే కొబ్బరి నూనె కోమిడోజెనిక్ (comedogenic). అంటే ఇది రాసుకుంటే మీ ముఖంపై ఉన్న రంధ్రాలు (pores) మూసుకుపోయేలా చేస్తుంది. (coconut oil)
*చాలా మంది వర్జిన్ కొబ్బరి నూనెను రాసుకుంటే మంచిది అనుకుంటారు కానీ అది కూడా కోమిడోజెనికే.
*అయితే మీ మోకాళ్లు, మోచేలు, అరిపాదాలకు కొబ్బరి నూనె రాసుకుంటే మంచిది. నలుపుని తగ్గించే సుగుణాలు ఉంటాయి.
*మరి కొబ్బరి నూనె కాకుండా ముఖానికి ఏ నూనె రాసుకోవాలి అంటే.. హోహోబా ఆయిల్, రోస్హిప్ ఆయిల్, ఆర్గన్ ఆయిల్ ఎంతో మంచివి. అవి నాన్ కోమెడోజెనిక్. అంటే రాసుకున్నా కూడా ముఖంపై ఉన్న పోర్స్ మూసుకుపోవు. పోర్స్ మూసుకుపోయేలా ఉన్న నూనెలు, క్రీములు ముఖానికి రాసుకుంటే యాక్నే వచ్చేస్తుంది. లోపల ఉన్న మురికి బయటికి పోకుండా ఆపేస్తాయి. (coconut oil)