Relationship: నిజంగా ప్రేమలో ప‌డ్డారా.. ఒంట‌రిత‌నంతోనా?

అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎదుటి వ్య‌క్తి న‌చ్చి వారితో ప్రేమ‌లో ప‌డ‌టం వేరు (relationship). కానీ జీవితంలో ఒంటరిత‌నంగా అనిపిస్తుండ‌డంతో ఒక తోడు ఉంటే బాగుండు అని ప్రేమ‌లో ప‌డ‌టం వేరు. నిజానికి అది ప్రేమే కాదు. జ‌స్ట్ మీకు ఒక తోడు కావాలంతే. మీరు నిజంగానే ప్రేమ‌లో ఉన్నారా.. లేక ఒంట‌రిత‌నాన్ని ప్రేమ‌గా ఊహించుకుంటున్నారో తెలుసుకోండి.

మిమ్మ‌ల్ని మీరు ప్ర‌శ్నించుకోండి

మీరు నిజంగానే స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌లో ఉన్నారా.. లేక తోడుకావాల‌ని అనుకుంటున్నారా అనేది మీరు మొద‌ట‌గా వేసుకోవాల్సిన ప్ర‌శ్న‌. ఒక‌వేళ మీ పార్ట్‌న‌ర్‌తో మీరున్న‌ప్పుడు అస‌లు టైమే తెలీక‌పోవ‌డం.. ఆ వ్య‌క్తితో మీకు ఎమోష‌న‌ల్ స‌పోర్ట్ ఉన్న‌ట్లు అనిపిస్తే అది నిజంగానే ప్రేమ అనుకోవాలి. అదే మీరు కేవ‌లం ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు ఒక తోడు ఉంది కాబ‌ట్టి ఆ వ్య‌క్తికి ఫోన్లు చేయ‌డం, మెసేజ్‌లు చేయడం క‌లిసి బ‌య‌టికి వెళ్లడం వంటివి చేస్తుంటే మాత్రం అది క‌చ్చితంగా ప్రేమ కాదు. ఈ తేడాల‌ను బేరీజు వేసుకుంటే మీది ప్రేమో ఒంట‌రిత‌నం వ‌ల్ల కోరుకున్న తోడో తెలిసిపోతుంది. (relationship)

గొడ‌వ‌లు వ‌చ్చిన‌ప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?

ఒక‌వేళ మీ పార్ట్‌న‌ర్‌తో మీకు గొడ‌వ‌లు వ‌చ్చినా.. లేదా ఇద్ద‌రికీ ఏవైనా ఆర్థిక, ఇత‌ర స‌మ‌స్య‌లు వ‌చ్చినా ఎలా ప‌రిష్క‌రించుకుంటున్నారో తెలుసుకోవ‌డం కూడా ముఖ్య‌మే. ఒక‌వేళ స‌మ‌స్య ఏదైనా ఇద్ద‌రూ క‌లిసి కూర్చుని మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకుంటే అది ప్రేమ‌. ఎందుకొచ్చిన గొడ‌వ‌రా బాబూ.. ఏమ‌న్నా అంటే బ్రేక‌ప్ అవుతుంది అని భ‌య‌ప‌డుతుంటే మాత్రం అది కేవ‌లం ఒంట‌రిత‌నం వ‌ల్ల ఏర్ప‌డిన తోడు అని గ‌మ‌నించాలి.

ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటున్నారు?

మీరు నిజంగా ప్రేమ‌లో ఉంటే మీ ఫ్రెండ్స్‌కి మీ పార్ట్‌న‌ర్‌కి సమానంగా విలువ‌, స‌మ‌యం ఇస్తారు. అదే విధంగా ఫ్రెండ్స్ కూడా మీతో స‌మ‌యాన్ని గ‌డ‌పాల‌ని చూస్తారు. అదే మీరు ఒంట‌రిత‌నం వ‌ల్ల ప్రేమ‌లో ఉన్న‌ట్లైతే.. మీ ఫ్రెండ్స్ కూడా మీకు దూరం అయిపోతారు. (relationship)

భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌లు

మీ పార్ట్‌న‌ర్‌తో క‌లిసి భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నారు అంటే అది ప్రేమ‌. ఇద్ద‌రూ ఒకరి బాధ్య‌త‌ల‌ను ఒక‌రు గౌర‌వించుకుంటే అది ప్రేమ‌. అదే కేవ‌లం ఒకే వ్య‌క్తి తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను మీరు పాటిస్తుంటే మాత్రం అది ప్రేమ కాదు. మ‌నకు ఒక తోడు కావాలి.. త‌ను ఏం చేస్తే అది ఓకే అనుకుంటే మాత్రం అది చాలా త‌ప్పు.

అంతేకాదు.. మీరు పార్ట్‌న‌ర్‌తో ఉన్నా లేక‌పోయినా మ‌న‌సు ప్ర‌శాంతంగా ఆహ్లాద‌క‌రంగా ఉండాలి. కేవ‌లం మీ పార్ట్‌న‌ర్‌తో ఉన్న‌ప్పుడే మీకు బాగుంటే మాత్రం అది ఒంట‌రిత‌నం వ‌ల్ల ఏర్ప‌డిన తోడు అనుకోవాలి. ఇలా ఒంట‌రిత‌నం కోసం ఒక తోడు కావాల‌ని కోరుకుంటే ఇప్పుడు బాగానే ఉన్నా భ‌విష్య‌త్తులో ఎన్నో ప‌రిణామాల‌కు దారితీస్తుంది అని విష‌యాన్ని గుర్తుపెట్టుకోండి. (relationship)