Liver విష‌పూరిత‌మైతే.. ఇవే సంకేతాలు

మ‌న కాలేయం (liver) విష‌పూరితంగా మారింది అన‌డానికి మ‌న శ‌రీరం మ‌న‌కు సంకేతాలు ఇస్తూ ఉంటుంది. వాటిని గ‌మ‌నించుకుని వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించ‌క‌పోతే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోతుంది.

*ఒళ్లంతా ఎక్కువ‌గా దుర‌ద పెడుతుంటే లివ‌ర్ స‌మ‌స్య ఉన్న‌ట్లు అర్థం. కాలేయం ర‌క్తంలోని టాక్సిన్స్‌ని బ‌య‌టికి పంపుతుంది. అలా పంపలేక‌పోతోంది అంటే ర‌క్తంలో టాక్సిన్స్ ఉన్న‌ట్లు. దాంతో దుర‌ద‌లు వ‌స్తాయి.

*ప‌చ్చ‌కామెర్లు వ‌చ్చిన‌ప్పుడు కూడా లివ‌ర్ ప‌నితీరు బాలేద‌ని గ్ర‌హించి వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి.  (liver)

*మీ మ‌లం రంగు ఎప్పుడూ లేని విధంగా ఉన్నా కూడా అప్ర‌మ‌త్తం అవ్వాల్సిందే. మ‌న కాలేయం బైల్ అనే లిక్విడ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. లిపిడ్స్ జీర్ణం కావ‌డానికి ఈ బైల్ లిక్విడ్ సాయ‌ప‌డుతుంది. అది స‌రిగ్గా లేక‌పోతే మ‌లం రంగు మారుతుంది.

*మూత్రం మ‌రీ డార్క్ రంగులో వస్తున్నా కూడా కాలేయ స‌మస్య‌కు సంకేత‌మే.

*ఏం తిన్నా వాంతులు అవుతున్న‌ట్లు అనిపిస్తోందంటే.. కాలేయ స‌మ‌స్య కావ‌చ్చు. ఎందుకంటే మ‌నం తిన్నాక ఆ ఆహారం నుంచి పోష‌కాల‌ను గ్ర‌హించి శ‌రీరానికి స‌మానంగా అందేలా చేసేది కాలేయ‌మే. అది స‌రిగ్గా ప‌నిచేయ‌న‌ప్పుడే ఒంటికి ఆహారం ప‌డ‌క వాంతులు, విరోచ‌నాలు అవుతుంటాయి. (liver)