STI: సెక్స్ చేయకపోయినా ఆ వ్యాధులు వస్తాయా?
STI: సురక్షితమైన శృంగారం చేయకపోతే ప్రైవేట్ భాగాల్లో కొన్ని వ్యాధులు సంక్రమిస్తాయి. వీటిని సెక్సువల్లీ ట్రాన్స్‌మిట్టెడ్ ఇన్‌ఫెక్షన్స్ లేదా వ్యాధులు అంటారు. అయితే సెక్స్ చేయని వారిలో కూడా ఈ ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తాయా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం ఏటా 10 లక్షల కంటే ఎక్కువ మంది ఈ లైంగికంగా సంక్రమించే వ్యాధుల బారిన పడుతున్నారు. యోనిలోకి అంగాన్ని పెట్టినా.. వెనక భాగం నుంచి పెట్టినా.. నోటి ద్వారా చేసినా కూడా ఈ వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులు రావడానికి ప్రధాన కారణం అయితే అసురక్షిత శృంగారమే. అయితే కొన్నిసార్లు హాస్పిటల్స్‌లో, ల్యాబ్‌లలో పరీక్షల కోసం బ్లడ్ శాంపుల్స్ తీసుకునేటప్పుడు వాడేసిన సూదిని వాడితే కూడా ఈ రోగాలు వస్తున్నాయని ప్రముఖ గైనకాలజిస్ట్ జాగృతి వర్షిణే తెలిపారు. (sti)
గర్భిణీలకు ఈ వ్యాధి ఉంటే అది ఆటోమేటిక్‌గా కడుపులోని పసికందులకు కూడా వ్యాపిస్తుంది. అయితే ఆల్రెడీ ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా వారి టాయ్‌లెట్ సీట్లు వాడినా ఇన్‌ఫెక్షన్ ఇతరులకు సోకదని చెప్తున్నారు. ఒకవేళ ఈ ఇన్‌ఫెక్షన్ బారిన పడిన వారికి లిప్ కిస్ ఇచ్చినా కూడా ఆ ఇన్‌ఫెక్షన్ సులువగా సోకుతుంది. వారు వాడిన లిప్ బామ్‌లు, వారు తిన్న కంచాలు, స్పూన్ల నుంచి తిన్నా కూడా ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉంది.
మరీ ముఖ్యంగా టాటూలు వేయించుకునేవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎంతటి పాష్ టాటూ పార్లర్ అయినా తెలిసో తెలీకో ఆల్రెడీ ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తికి వాడిన టాటూ పెన్నుతోనే ఆరోగ్యంతో ఉన్న వ్యక్తిపై వాడితే ఆ ఇన్‌ఫెక్షన్ వారికి కూడా సోకుతుంది. అయితే ఈ ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రం అసలు ఏమీ తెలీదు. ఆరోగ్యంగానే ఉన్నట్లు ఉంటుంది. నెమ్మదిగా ప్రైవేట్ భాగాల్లో దురద, మంట, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. (sti)