ఒక్క వ్యాయామం బాడీ మొత్తం పనిచేస్తుందా?
ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌కి వెళ్లి రకరకాల వ్యాయామాలు (excercise) చేస్తుంటారు. కొన్ని వ్యాయామాల పేర్లు అసలు పలకడానికి కూడా రావు. అన్ని చేస్తేనే బాడీ ఫిట్‌గా మారుతుంది అంటారు జిమ్ కోచెస్. కానీ రోజూ కేవలం ఒకే ఒక్క వ్యాయామంతో మొత్తం శరీరాన్ని బలంగా మార్చుకునే అవకాశం ఉందా? ఉంది అనే అంటున్నారు యోగా నిపుణులు జూహీ కపూర్. ఆ ఒక్క వ్యాయామం పేరే యోగాలోని సర్వాంగపుష్ఠి (sarvangapushti).
ఆ సర్వాంగపుష్ఠి అనే యోగా ప్రక్రియ శరీరంలోని అన్ని కండరాలపై ప్రభావం చూపి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుందట. అంతేకాదు మైండ్‌ని ప్రశాంతంగా ఉంచుతుంది కూడా. ఈ యోగాసనాన్ని సవ్యదిశలో (క్లాక్‌వైస్) 15 సార్లు.. అసవ్యదిశలో (యాంటీ క్లాక్ వైస్) 15 సార్లు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈ సర్వాంగపుష్ఠి ఆసనం చేతులు, కాళ్లు, మెడ, నడుము, పిరుదులు, పొట్ట, తొడలపై ప్రభావం చూపుతుంది.
సర్వాంగపుష్ఠి ఆసనం ఎలా వేయాలో కింద ఉన్న లింక్ క్లిక్ చేసి దాని గురించి మరింత తెలుసుకోండి. ఎందుకంటే ఆసనాలు, వ్యాయామాలు చెప్తే అర్థంకావు. ఎదుటివారు చేసి చూపిస్తుంటేనే కరెక్ట్‌గా ఎలా చేయాలో తెలుస్తుంది. (excercise)
https://www.instagram.com/reel/CyF5qKkoWQG/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==