Lemon Water: ఉద‌యాన్నే తాగేస్తున్నారా.. జాగ్ర‌త్త‌!

Lemon Water: ఉద‌యాన్నే నిమ్మ ర‌సంలో తేనె వేసుకుని తాగితే బ‌రువు త‌గ్గుతారు అనేది ఈపాటి కొన్ని వేల సార్లు వినే ఉంటాం. అస‌లు ఉద‌యాన్నే నిమ్మ రసం తాగ‌చ్చా? తాగ‌చ్చు కానీ దేని కైనా మంచి చెడు అనేవి ఉంటాయి క‌దా..! ఉద‌యాన్నే నిమ్మ ర‌సం తాగ‌డం వ‌ల్ల మీకు ఈ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయో చూసుకోండి.

*నిమ్మ జాతి పండ్లు తిన‌డం, వాటి ర‌సాలు తాగ‌డం వ‌ల్ల మైగ్రేన్ ట్రిగ్గ‌ర్ అయ్యే ఛాన్స్ ఉంది. నిమ్మ జాతి పండ్ల‌లో మోనో అమైన్ టైరామైన్ అనే ఎన్‌జైం ఉంటుంది. ఇది త‌ల‌నొప్పుల‌కు దారి తీస్తుంది.

*రోజూ తాగే అల‌వాటు ఉన్న‌వారికి ఎసిడిటీ స‌మ‌స్య‌లు, క‌డుపు ఉబ్బ‌రంగా ఉండ‌టం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

*నిమ్మ జాతి పండ్లు నూనెల‌ను పీల్చేసుకుంటాయి. అందుకే రెస్టారెంట్లు, హోట‌ళ్ల‌లో బిర్యానీ, లేదా ఇత‌ర ఫుడ్ ఐటెమ్స్ తిన్నాక ఫింగ‌ర్ బౌల్‌లో నిమ్మ‌కాయ నీళ్లు ఇస్తారు. నిమ్మ‌ర‌సం తాగినా నిమ్మ జాతి పండ్లు ఎక్కువ‌గా తింటున్నా కూడా అవి ఎముకల్లో స‌హ‌జంగా ఉండే నూనెల‌ను కూడా పీల్చేసుకుంటాయి. దాని వ‌ల్ల ఎముక‌ల్లో జిగురు, స‌హ‌జ నూనెలు పోయి చిన్న దెబ్బ తగిలినా ప‌ట్టున విరిగిపోతాయి. (lemon water)

*నిమ్మ రసం ఎక్కువగా తాగితే స్కిన్ క్యాన్స‌ర్ వ‌చ్చే ప్రమాదం ఉంది. విన‌డానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే నిమ్మ‌లో సోరాలెన్స్ అనే ఎన్‌జైమ్ ఉంటుంది. ఇది క్యాన్స‌ర్ కార‌కం.

*మీరెప్పుడైనా ముఖానికి నిమ్మ‌కాయ రాసుకుని ఓ ప‌ది నిమిషాల పాటు ఎండ‌లో నిల‌బ‌డ్డారా? మీ ముఖం మాడిపోతుంది. ఎందుకంటే నిమ్మ‌జాతి పండ్ల‌లో ఉండే కెమిక‌ల్ కాంపౌండ్స్ త్వ‌ర‌గా సూర్య‌కిర‌ణాల నుంచి వచ్చే యూవీ కిర‌ణాల‌ను గ్ర‌హించుకుంటాయి. మీరు రోజూ నిమ్మ‌కాయ ర‌సం తాగుతున్న‌ట్లైతే.. శ‌రీరం ఎండ‌కు ఎక్స్‌పోజ్ అయిన‌ప్పుడు విప‌రీతంగా ట్యాన్ అవుతూ ఉంటుంది. (lemon water)

*నిమ్మలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంద‌ని అంద‌రికీ తెలిసిందే. రోజూ తాగ‌డం వ‌ల్ల ఆ సిట్రిక్ యాసిడ్ ప‌ళ్ల‌పై ఉండే ఎనామిల్‌ను పాడుచేస్తుంది.

ఈ వివ‌రాల‌ను కేవ‌లం స‌మాచారంగా మాత్ర‌మే అందించ‌బ‌డింది. ఆహారం, ఫిట్‌నెస్, మందుల విష‌యంలో మీకు ఏవైనా స‌ల‌హాలు ఉంటే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం